Three marriages celebrity: నచ్చినంతవరకు కలిసి ఉండటం.. విభేదాలు ఎదురైతే కటీఫ్ చెప్పుకోవడం సెలబ్రెటీల జీవితాలలో సర్వసాధారణం. ఒకప్పుడు ఇటువంటి కల్చర్ మన దేశంలో ఉండేది కాదు. అయితే కొంతకాలంగా ఇటువంటి కల్చర్ మనదేశంలో కూడా కొనసాగుతోంది. మొదట్లో ఇది సెలబ్రిటీల జీవితాలలో మాత్రమే కనిపించేది. ఇప్పుడు సామాన్యులు కూడా అదే దారి కొనసాగిస్తున్నారు. నచ్చినత కాలం ఉండడం.. ఆ తర్వాత విడిపోవడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది.
ఇక వెస్ట్రన్ దేశాలలో సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం ఎంత సులభమో.. విడాకులు తీసుకోవడం కూడా అంతే సులభం. కాకపోతే వెస్ట్రన్ కంట్రీస్ లో చట్టాలు విచిత్రంగా ఉంటాయి. విడాకులు తీసుకుంటున్న క్రమంలో భార్యకు భర్త ఖచ్చితంగా భరణం చెల్లించాలి. అక్కడ చట్టాల ప్రకారం భరణం భారీ స్థాయిలో ఉంటుంది.. మూడుసార్లు వివాహాలు చేసుకుని.. అంతకుమించి సంబంధాలు కొనసాగించి.. భారీగా భరణం భారీగా పొందిన సెలబ్రిటీ ఒకరున్నారు. ఆమె పేరు కిమ్ కర్దాషియన్.
కిమ్ అమెరికా దేశంలో పేరుపొందిన సెలబ్రిటీ. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాలమయం. ఆమెకు సెలబ్రిటీ హోదా రాకముందు.. సాధారణంగానే జీవితం గడిపింది.. అయితే సెలబ్రిటీ కాకముందే ఆమె అంటే 19 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకుంది.. 2000 సంవత్సరంలో డామన్ థామస్ ను వివాహం చేసుకున్నది.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నది. థామస్ ఆమెకు భరణంగా రెండు మిలియన్ డాలర్లు ఇచ్చాడు.
థామస్ తర్వాత క్రిస్ హంపేయర్స్ ను రెండవ వివాహం చేసుకుంది కర్దాషియన్. ఆబంధం కూడా ఎక్కువ కాలం నిలవలేకపోయింది.. వ్యక్తిగత విభేదాలతో వారిద్దరు విడిపోయారు. విడాకుల సమయంలో కర్దాషియాన్ కు అతడు ఏకంగా ఐదు మిలియన్ డాలర్లు భరణంగా చెల్లించాడు.
ఇక ఈలోపు సెలబ్రిటీ కావడంతో కర్దాషియన్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇదే సమయంలో కాన్యే వెస్ట్ ను 2014లో వివాహం చేసుకుంది.. 2022లో విడాకులు ఇచ్చింది.. కాన్యే ద్వారా కర్దాషియాన్ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. విడాకుల తర్వాత కర్దాషియన్ కు కాన్యే 200 మిలియన్ డాలర్లు.. భరణంగా చెల్లించాడు.
వివాహాల ద్వారా మాత్రమే కాకుండా సంబంధాల ద్వారా కూడా కిమ్ కర్దాషియాన్ సంచలనం సృష్టించింది. షార్లెట్ జాన్సన్, నిక్ లాచీ, రెగ్గీ బుష్, మైల్స్ అస్టిన్, గాబ్రియల్ అబ్రే, ఫీట్ డేవిడ్సన్, ఫ్రెడ్, ఒడెల్ బెక్హామ్ జూనియర్ వంటి వారితో కిమ్ సంబంధాలు కొనసాగించిందని అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ఒక స్థిరాస్తి వ్యాపారితో డేటింగ్ లో ఉందని తెలుస్తోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. సంబంధాల గురించి మొహమాటం లేకుండా చెప్పే కిమ్.. ఈసారి మాత్రం అత్యంత గోప్యత పాటిస్తోంది. అయితే ఆ స్థిరాస్తి వ్యాపారి కిమ్ కు పెద్ద ఫ్యాన్ అని.. అందువల్లే అతనితో డేటింగ్ చేస్తోందని తెలుస్తోంది.