Ali tho Saradaga: ఈ మధ్య కాలంలో బుల్లి తెర పై ఉన్న టాక్ షో లలో క్రేజీ టాక్ షో గా పేరు పొందింది మాత్రం ‘అలీ తో సరదాగా’. టాలీవుడ్ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న ఈ షో ని జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. కొత్త – పాత, చిన్నా- పెద్దా, వెండితెర – బుల్లితెర అని తేడా లేకుండా ప్రతి ఒక్క సెలబ్రిటీ ని పిలిచి సరదాగా ప్రేక్షకులకి తెలియని ముచ్చట్లు పంచిపెడుతున్నారు.
‘చెన్నకేశవరెడ్డి’, ‘లక్ష్మి కల్యాణం’ తదితర చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన నాగినీడుకు ‘మర్యాద రామన్న’ చిత్రం ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. మర్యాద రామన్న చిత్రంలో రామినీడుగా కనిపించి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు నాగినీడు. అంతే కాకుండా ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డును కూడా అందుకున్నారు. సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఆ సినిమా తర్వాత ‘పిల్ల జమీందార్’, ‘సీమ టపాకాయ్’, ‘ఇష్క్’, ‘బెంగాల్ టైగర్’, ‘స్పైడర్’, ‘రూలర్’, ‘వకీల్‌సాబ్’ తదితర చిత్రాలతో అలరించారు.
అయితే తాజా గా విడుదల అయిన అలీ తో సరదాగా ప్రోమో లో నాగినీడు తన మనసులో మాట బయట పెట్టాడు. మర్యాద రామన్న మీకు మంచి పేరు తెచ్చిందా అని అడగ్గా … నేను నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం నాకు మంచి పేరు తో తెచ్చి పెట్టింది. కానీ, అదే నాకు పెద్ద మైనస్సు అయ్యింది అని చెప్పాడు నాగినీడు. అవకాశం కోసం ఏ దర్శకుడినైనా సంప్రదిస్తే ‘నాగినీడుగారు.. మీరు మాత్రమే న్యాయం చేయగలరు అనే పాత్ర ఉంటే మీకు ఇస్తాం. మా సినిమాలో అలాంటి క్యారెక్టర్ లేదు. మిమ్మల్ని సాధారణ పాత్రల్లో ఊహించుకోలేం కదా’ అనేవారు… అని తనకు జరిగిన సంఘటన ని తెలియ చేసాడు నాగినీడు. . ఇవన్నీ ఎందుకు నాకు డబ్బొస్తే చాలు అని మనుసులో అనుకునేవాడ్ని’ అని తన సినీ కెరీర్ గురించి చెప్పారు నాగినీడు.