https://oktelugu.com/

Star Director: 10 సంవత్సరాల్లో కేవలం రెండు సినిమాలే చేసిన ఈ స్టార్ డైరెక్టర్…

ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్న అందులో కేవలం రెండు సినిమాలను మాత్రమే చేయడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓ జి సినిమా కూడా షూటింగ్ దాదాపు పూర్తి అయినప్పటికీ...

Written By:
  • Gopi
  • , Updated On : March 2, 2024 / 12:11 PM IST
    Follow us on

    Star Director: ఇండస్ట్రీ లో కొంత మంది డైరెక్టర్లు చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ వాళ్లకంటు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. ఇక మరి కొంతమంది మాత్రం చాలా తక్కువ సినిమాలు చేసి ఎక్కువ గుర్తింపును సంపాదించుకుంటారు. ఇక అలాంటి వారిలో డైరెక్టర్ సుజిత్(Director Sujeeth) ఒకరు. 2014లో శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్ అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమాతో మరొకసారి భారీ సినిమాని చేశారు. అయితే ఈ సినిమా తెలుగులో అనుకున్నంత విజయం సాధించకపోయిన బాలీవుడ్ లో మాత్రం భారీ విజయాన్ని అందుకుంది.

    ఇక దాంతో సుజిత్ బాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్న అందులో కేవలం రెండు సినిమాలను మాత్రమే చేయడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓ జి సినిమా కూడా షూటింగ్ దాదాపు పూర్తి అయినప్పటికీ ఈ సినిమాని సెప్టెంబర్ 27వ తేదీకి రిలీజ్ చెయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమం లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను అనుకున్న తేదీకి తీసుకురాగలరా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన 10 సంవత్సరాల కాలం లో కేవలం రెండు నుంచి మూడు సినిమాలు మాత్రమే చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమనే చెప్పాలి. ఇక ఈయనతోపాటు డైరెక్టర్ గా పరిచయమైన అనిల్ రావిపూడి లాంటి వారు ఇప్పటికీ ఏడు నుంచి ఎనిమిది సినిమాలు చేశారు.

    కానీ ఈయన మాత్రం మూడు సినిమాలా దగ్గరే ఆగిపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమనే చెప్పాలి. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఈయన ఎన్ని సినిమాలు చేశామనే దానికంటే మంచి సినిమాలు చేశామా లేదా అనే దానికే ఎక్కువ ప్రియార్టి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఓజి సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొట్టడం పక్క అంటూ ఇప్పటికే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లే తెలుస్తుంది…