https://oktelugu.com/

Heroines: ఈ నలుగురు హీరోయిన్ లు ఏంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..

కొందరు హీరోయిన్ లను గమనిస్తే.. ఈ సంవత్సరం సింగిల్ కింగ్ లాగా రావడానికి సిద్దమైనట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ లు ఎవరు? ఆ సినిమాలేంటి? అనే వివరాలు కూడా చూసేద్దాం..

Written By:
  • Neelambaram
  • , Updated On : January 8, 2024 / 02:23 PM IST
    Follow us on

    Heroines: ఒకప్పుడు హీరోలు ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. హీరోయిన్ ఎవరున్నా కూడా పట్టించుకోకుండా అభిమాన హీరో అయితే థియేటర్లకు క్యూ కట్టేవారు ప్రజలు. కానీ ప్రస్తుతం ఈ సెంటిమెంట్ మారిపోయింది. హీరోయిన్ లు కూడా దుమ్ములేపుతూ.. తమకంటూ స్పెషల్ గుర్తింపు పొందుతున్నారు. అంతే కాదు హీరో లేకుండా కూడా మేము హిట్ సాధించగలం అంటున్నారు. ఇలాంటి వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది హీరోయిన్ లు ఈ వైపే అడుగులు వేస్తున్నారు. హీరోతో మాత్రమే హిట్ సంపాదిస్తే రేపటికి కెరీర్ ఉండదున్నారు కావచ్చు.. సింగిల్ గా క్వీన్ అనిపించుకుంటున్నామని బయలుదేరారు కొందరు.

    కొందరు హీరోయిన్ లను గమనిస్తే.. ఈ సంవత్సరం సింగిల్ కింగ్ లాగా రావడానికి సిద్దమైనట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ లు ఎవరు? ఆ సినిమాలేంటి? అనే వివరాలు కూడా చూసేద్దాం.. సమంత, అనుష్క శెట్టి, కీర్తి సురేష్ లు ఇప్పటికే సింగిల్ గా వచ్చి హిట్ లను సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం సమంత, కీర్తి సురేష్ లతో పాటు పూజా హెగ్డే, రష్మిక మందన్న కూడా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి సిద్దమయ్యారట. పూజ హెగ్డే హిందీలో దేవ సినిమా చేస్తోంది. అంతే కాదు ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు ఒప్పుకుందట. ఇందులో టైటిల్ రోల్ చేస్తుందట అమ్మడు. అంటే హీరోకు ఉన్నంత ప్రాధాన్యత ఉంటుందట.

    రాధేశ్యామ్ తర్వాత పూజా హెగ్డే కు ఒక్క హిట్ సినిమా కూడా లేదు. కానీ గుంటూరు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకున్నా ఆ తర్వాత మిస్ అయింది. అందుకే హీరోలను నమ్ముకోవద్దనుకుంది కావచ్చు.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయడానికి సిద్దమైంది. మహానటి, పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్, సఖి సినిమాల్లో నటించి హిట్ లను రుచి చూసింది కీర్తి సురేష్. భవిష్యత్తులో కూడా ఈ అమ్మడు ఇలాంటి సినిమాల్లోనే నటించాలనుకుంటుందట. ఇక దసరా సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నా.. భోళా శంకర్ తో ఫ్లాప్ ను అందుకుంది. అందుకే మళ్లీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకుంటుందట.

    ఇక ఈ హీరోయిన్ చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయట. అందులో ఒకటి లేడీ ఓరియెంటెడ్ అని టాక్. అంతే కాదు కీర్తి సురేష్ బోల్డ్ పాత్రలో కూడా నటించేందుకు ఒప్పుకుందట. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల యానిమల్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం పుష్ప 2 తప్ప మరో సినిమాలో కనిపించదు. ఈ సినిమా తర్వాత మాత్రం ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందకు రానుంది. ఇక సమంత కూడా ఇలాంటి సినిమాలతో ముందుకు రానుందని మరో టాక్. ఇలా వీరంతా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. అంతే కాదు ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసారు ఈ అందాల తారలు. మరి వీరి సినిమాలు అనుకున్న ఫలితాలను ఇస్తాయో లేదో చూడాలి.