https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్ తన కెరియర్ లో అనవసరంగా చేశాను అనుకునే సినిమాలు ఇవే…

ఎన్టీఆర్ కెరియర్ లో చాలా ఫ్లాపులు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆయన కొన్ని సినిమాలను అనవసరంగా చేశాను అని చాలాసార్లు బాధపడ్డట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 2, 2024 / 03:03 PM IST
    Follow us on

    NTR: సినిమా ఇండస్ట్రీలో మన హీరోలు చేసిన కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ ని మూట గట్టుకుంటాయి. అయితే ఆ తర్వాత ఈ సినిమాలను మనం ఎందుకు చేశామా అని మన హీరోలు విపరీతమైన బాధకి గురవుతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

    అయితే ఆయన కెరియర్ లో చాలా ఫ్లాపులు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా ఆయన కొన్ని సినిమాలను అనవసరంగా చేశాను అని చాలాసార్లు బాధపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగా టెంపర్ సినిమా(Temper Movie) ఆడియో రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన ఇప్పటిదాకా కొన్ని పిచ్చి సినిమాలు చేశాను. కానీ ఇప్పటినుంచి అన్ని మంచి సినిమాలు చేస్తానని తన అభిమానులకి మాట ఇచ్చాడు. ఇక తను మాట ఇచ్చినట్టుగానే ప్రస్తుతం వరుస హిట్స్ ని కొడుతూ మంచి జోష్ మీద ఉన్నాడు. తన కెరియర్ లో చేసిన పిచ్చి సినిమాలు ఆయనకు నచ్చని సినిమాలు ఏంటి అంటే నరసింహుడు, నాగ, రభస లాంటి సినిమాలు ఆయనకు ఇష్టం లేకపోయిన చేయాల్సి వచ్చిందంట…

    ఇక మొత్తానికైతే వాటి రిజల్ట్ కూడా తేడా కొట్టడం తో ఆయన అందుకే ఇప్పుడు చేసే సినిమాల విషయంలో ఆచితూచి అడిగేస్తున్నాడు. ఇక ఆయనకి స్టొరీలపరంగా సలహాలిచ్చే వారు ఎవరు లేరు ఆయనకి ఆయనే సొంతగా డిసిజన్ తీసుకోవాలి. కాబట్టి మొదటి నుంచి ఆయనే స్టోరీలను విని సినిమాలు చేస్తు వస్తున్నారు.

    అందువల్లే ఆయనకి స్టోరీలను జడ్జ్ చేయడంలో పరిపూర్ణమైన నాలేడ్జ్ వచ్చిందని దానివల్లే తను ఇప్పుడు మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాడని ఎన్టీఆర్ కి సన్నిహితంగా ఉండే కొంతమంది చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొట్టడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…