Highest grossing Indian films 2025: ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వందల సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో ఇండస్ట్రీల వారీగా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలు 5 ఉన్నాయి. ఈ ఏడాది కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువే. కానీ ఈ 5 సినిమాలు వెంటిలేటర్ మీద ఉన్న సినీ పరిశ్రమ ని పైకి లేపాయి. మరి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో టాప్ గ్రాసర్స్ గా నిల్చిన సినిమాలేంటో ఒకసారి చూద్దాం.
టాలీవుడ్ – ఓజీ(They Call Him OG):
పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఈ సినిమా ఎంతటి భారీ అంచనాల నడుమ విడుదలైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ అంచనాలకు తగ్గట్టే అభిమానులను ఈ సినిమా అలరించడం తో, ఇండియా లోనే ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ ని రాబట్టి, ఫుల్ రన్ లో 316 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సంపాదించి, 2025 లో ఆల్ టైం టాలీవుడ్ నెంబర్ 1 చిత్రం గా నిల్చింది.
కోలీవుడ్ – కూలీ(Coolie Movie):
సూపర్ స్టార్ రజినీకాంత్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ ఆ అంచనాలను అందుకోవడం లో ఆడియన్స్ ని నిరాశపర్చినప్పటికీ, కలెక్షన్స్ పరంగా కోలీవుడ్ లో 2025 టాప్ గ్రాసర్ గా నిల్చింది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 510 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
బాలీవుడ్ – చావా(Chaava Movie):
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని విక్కీ కౌశల్ హీరో గా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని నెలకొల్పింది అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం దాదాపుగా 820 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
శాండిల్ వుడ్ – కాంతారా 2(Kanthara – The chapter 1) :
కాంతారా వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా కాబట్టి ఈ చిత్రం పై మొదటి నుండి అన్ని బిషాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ కి తగ్గ టాక్ కూడా రావడంతో అన్ని భాషలకు కలిపి ఈ చిత్రానికి 800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. అంతే కాకుండా 2025 శాండిల్ వుడ్ టాప్ గ్రాసర్ గా కూడా నిల్చింది ఈ చిత్రం.
మాలీవుడ్ – లోక(Lokah Movie) :
కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఏకంగా మోహన్ లాల్ రెండు సూపర్ హిట్ సినిమాలను కూడా దాటుకొని, మాలీవుడ్ లో కేవలం 2025 వ సంవత్సరం లోనే కాదు. మాలీవుడ్ లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.