https://oktelugu.com/

Baahubali: బాహుబలి లో బళ్లాల దేవుడు పాత్రను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో…

రాజమౌళి లాంటి డైరెక్టర్ ఇండియాలో మరొకరు లేరనేది వాస్తవం...ఎందుకంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఇండియన్ స్క్రీన్ మీద పెను సంచలనాన్ని సృష్టించాయి...బాహుబలి కి పోటీగా ఉన్న 'బళ్లాల దేవుడు' క్యారెక్టర్ ను పోషించే నటుడు ఎవరు అనే దానిమీద రాజమౌళి చాలా రోజులు కసరత్తులైతే చేశారట.

Written By:
  • Gopi
  • , Updated On : August 4, 2024 / 10:52 AM IST

    Baahubali

    Follow us on

    Baahubali: పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి సినిమాతో ఒక ప్రభంజనాన్ని సృష్టించిన దర్శకుడు రాజమౌళి… ఈయన సునీల్ తో ‘మర్యాద రామన్న’ సినిమా చేస్తున్నప్పుడు పాన్ ఇండియాలో ఒక సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే ప్రభాస్ ని కలిసి డార్లింగ్ మనం ఒక పిరియాడికల్ డ్రామా సినిమాని చేయబోతున్నాం అది రాజుల కాలం నాటి కథతో తెరకెక్కబోతుంది. దానికోసం నువ్వు రెడీగా ఉండు అంటూ చెప్పారట. దానికి ప్రభాస్ కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట…ఇక ఈగ సినిమా షూట్ సమయంలో రాజమౌళి వాళ్ళ ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్ తో ఒక రాజుల కాలం నాటి స్టోరీ కావాలి. అందులో ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలి అని చెప్పారట. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రాజమౌళి మీద ‘మోడ్రన్ మాస్టర్స్’ అనే డాక్యుమెంటరీని చేశారు. ఇక అందులో వీటి గురించి రివిల్ చేశారు. ఇక దానికి అనుగుణంగానే సినిమాను అనుకున్న సమయంలో ఒక లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కించాలని రాజమౌళి గాని, ప్రొడ్యూసర్ శోభయార్లగడ్డ గారు కానీ అనుకున్నారట. కానీ అది అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ఈ సినిమాని రెండు పార్టు లుగా చేశారు…ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ బాహుబలి గా సెట్ అయ్యాడు. మరి ఈ సినిమాలో బాహుబలి కి పోటీగా ఉన్న ‘బళ్లాల దేవుడు’ క్యారెక్టర్ ను పోషించే నటుడు ఎవరు అనే దానిమీద రాజమౌళి చాలా రోజులు కసరత్తులైతే చేశారట. ఇక హాలీవుడ్ ‘ఆక్వా మెన్ ‘ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘జేసన్ మమోవా’ ను ఈ సినిమాలో విలన్ గా తీసుకోవాలని రాజమౌళి ప్రయత్నం చేశారట.

    Also Read: రాజశేఖర్ ఆ ఒక్క మిస్టేక్ చేయకపోతే ఇప్పడు చిరంజీవి, బాలయ్య ల పక్కన నిలబడేవాడు…

    ఎందుకంటే అంటే ప్రభాస్ భారీ కటౌట్ తో ఉంటాడు కాబట్టి అలాంటి కటౌట్ తోనే బళ్లాల దేవుడు కూడా ఉండాలని ఇక అతన్ని ఎదుర్కోవాలి అంటే అంతటి విలన్ పాత్ర ఉన్నప్పుడే ప్రేక్షకులు చూడగలుగుతారనే నిర్ణయంలో రాజమౌళి ఉన్నాడట. ఇక ఇదే సమయంలో ప్రొడ్యూసర్ శోభూ యార్లగడ్డతో ఈ విషయాన్ని చెబితే ఆయన మాత్రం ఒకసారి నేను రానా ను అడిగి చూస్తానని చెప్పారట. ఇక తను అనుకున్నట్టుగానే రానా ను కలిసి ఈ క్యారెక్టర్ గురించి వివరించి చెప్పారట.

    అప్పుడు రానా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా కోసం బాడీ ని భారీగా బిల్డ్ చేశాడు. రాజమౌళి కూడా ఆయన బాడీని చూసి ఇంకా కొంచెం వర్కౌట్ చేస్తే విలన్ గా బాగా సెట్ అవుతారని అనుకొని ఆ పాత్రను రానాతో చేయించాలని ఫిక్స్ అయ్యారట. అయితే రానా ఒకరోజు నా పాత్రలో నాకంటే ముందు ఎవరైనా యాక్టర్ ని అనుకున్నారా అని శోభూ యార్లగడ్డని అడిగితే ఆయన హాలీవుడ్ యాక్టర్ అయిన మమోవా ని తీసుకుందామని అనుకున్నామని చెప్పాడట.

    ఇక దానికి రానా నవ్వుకున్నాడట… ఇక మొత్తానికైతే భారీ వ్యయం తో తెరకెక్కిన బాహుబలి సినిమా ప్రొడ్యూసర్స్ కి ఒక ఎక్స్పరిమెంటల్ సినిమా అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరిస్తే రాజమౌళి మాత్రం పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. బాహుబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియాలోనే చాలా పెద్ద హిట్ గా నిలిచింది…

     

    Also Read: అల్లు అర్జున్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా..? ఆయన ఆ పాత్రలో నటిస్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే…