RRR Oscar: ప్రపంచం లో ఉన్న ఎంతో మంది దిగ్గజ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఏదైనా ఉందా అంటే అది ఆస్కార్ మాత్రమే.సాంకేతికంగా హాలీవుడ్ ఇండస్ట్రీ కి ఏమాత్రం తీసిపోము అని నిరూపించిన మన ఇండియన్ సినిమాకి కూడా ఆస్కార్ అవార్డు రావాలని ఎంతో మంది బలంగా కోరుకుంటూనే ఉన్నారు.ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి, మరెన్నో ఆల్ టైం క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి, కానీ ఒక్కటి కూడా ఆస్కార్ గెలుచుకోలేకపోయింది.

కనీసం నామినేషన్స్ కూడా దక్కించుకోలేకపోయింది.మనం ఎందులో తక్కువ..?, ఎందుకు మనకి అలాంటి గౌరవాలు దక్కలేదు అని ప్రతీ ఒక్కరు అసహనానికి గురైన సందర్భాలు ఉన్నాయి.అలాంటి వాళ్ళందరి అసంతృప్తి కి తెరదించుతూ నిన్న మన ఇండియన్ సినిమా #RRR కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు రావడం అనేది తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, ఇండియన్స్ అందరూ ఎంతో గర్వించారు.
అయితే ఈ ఆస్కార్ అవార్డు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మరియు లిరిక్ రైటర్ చంద్ర బోస్ కి మాత్రమే దక్కింది, ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి కి క్రెడిట్ దక్కింది.కానీ హీరోల పేర్లని మాత్రం ఎవ్వరూ అంత హైలైట్ చెయ్యలేదు.ఇదే అందరినీ నిరాశకి గురి చేస్తున్న విషయం.అంతే కాదు వాళ్ళ చేత అద్భుతమైన స్టెప్పులు వేయించిన డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ పేరుని కూడా ఎవ్వరూ తల్చుకోలేదు.
ఒక్కసారి ‘నాటు నాటు’ పాటని హీరోలిద్దరి డ్యాన్స్ ని పక్కన పెట్టి కేవలం పాటని మాత్రం పరిగణలోకి తీసుకుంటే ఆస్కార్ అవార్డు వచ్చి ఉండేదా..? ఒక్కసారి ఆలోచించండి..?, కేవలం హీరోల డ్యాన్స్ వల్లే కదా ఇంత రీచ్ వచ్చింది,దేశం మొత్తం ఊగిపోతూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసింది హీరోల స్టెప్పులకే కదా..?, అలాంటిది హీరోలకంటే ఎక్కువ క్రెడిట్ కీరవాణి కి కానీ, చంద్ర బోస్ కి కానీ ఎందుకు వెళ్తుంది.?, మా దృష్టిలో ఆస్కార్ అవార్డు రియల్ విన్నర్స్ రామ్ చరణ్ – ఎన్టీఆర్- ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మాత్రమే.మరి మీ ఒపీనియన్ ఏమిటో క్రింద కామెంట్స్ లో తెలపండి.