Martin Movie Trailer: కన్నడ సినిమా ఇండస్ట్రీలో దృవ సర్జా హీరోగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. భారీ బాడీతో విలన్ల మీద పోరాటం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం ఆయన ‘ మార్టిన్ ‘ అనే ఒక కొత్త సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని చూస్తే సినిమా మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నిడిపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే ధృవ సర్జా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలైతే చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని చూసిన బాలీవుడ్ జనాలు మాత్రం దీని మీద నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ అంత బాగా లేవని ఈజీగా తెలిసిపోతున్నాయంటూ, అలాగే ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అంత బాగా ఎలివేట్ అవ్వలేదని, విజువల్స్ కూడా అంత గ్రాండ్ గా లేవని, ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఇక మరి కొంతమంది సినీ విమర్శకులు సైతం కన్నడ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది.
ముఖ్యంగా శెట్టి త్రయం మంచి సినిమాలను చేస్తూ ఇండియాలోనే కన్నడ సినిమా ఇండస్ట్రీ యొక్క సత్తాను చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ యశ్ లాంటి వాళ్ళు కూడా భారీ సక్సెస్ లను కొడుతున్నారు. ఇక ఇలాంటి సమయంలో ధృవ సర్జా లాంటి వాళ్ళు నాసిరకం సినిమాలతో కన్నడ సినిమా ఇండస్ట్రీ పరువు తీయడానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అంటూ మార్టిన్ సినిమా మీద చాలామంది నెగిటివ్ కామెంట్లైతే చేస్తున్నారు…
ఈ ట్రైలర్ ను చూసిన ఇంకొంతమంది మాత్రం ఈ ట్రైలర్ కట్ చాలా దారుణంగా ఉందని, అసలు ట్రైలర్ కట్ ఎలా చేయాలో మీకు తెలుసా అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ఏపీ అర్జున్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కథ ఇండియన్ పాకిస్తాన్ బ్యాడ్రాప్ లో ఉండటం వల్ల ఇంతకు ముందు వరకు ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తున్నారు అనే ఒక ఆసక్తి మాత్రం అందరిలో ఉండేది. ఇక ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం సహజం. ఇలాంటి ఒక ఫెలవమైన ట్రైలర్ ని తీసుకొచ్చినందుకు సినిమా యూనిట్ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ఇక ఈ సినిమాకి తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తుంటే, రవి బస్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని అందిస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాను చేసినందుకు ఆయనకి మంచి పేరు వస్తుందా లేదంటే ప్లాప్ అయి కన్నడ ఇండస్ట్రీ పరువు తీస్తుందా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ధృవ సర్జా మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పాన్ ఇండియాలో మాత్రం ఆయన సినిమాలు ఇప్పటివరకు సక్సెస్ అయితే సాధించలేదు. మరి ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదగాలనుకుంటున్నాడు ఆయన ప్రయత్నం సఫలం అవుతుందా లేదా విఫలం అవుతుందా అనేది అక్టోబర్ 11వ తేదీన తెలుస్తుంది…