https://oktelugu.com/

Tamannaah Vs Nora Fatehi: తమన్నా, నోరా కు మధ్య పెరుగుతున్న పోటీ…వీళ్లలో ఎవరు పై చేయి సాధించారు…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరిలోకెళ్లా నటనతో పాటు డ్యాన్స్ తో కూడా అదరగొట్టే నటీమణులు మాత్రం కొంత మందే ఉన్నారు. అందులో తమన్నా ఒకరు....

Written By:
  • Gopi
  • , Updated On : July 25, 2024 / 10:27 AM IST

    Tamannaah Vs Nora Fatehi

    Follow us on

    Tamannaah Vs Nora Fatehi: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమన్నా తనదైన రీతిలో ముందుకు సాగుతుంది. ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్న కూడా ఇప్పటికీ కూడా టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడం అంటే మామూలు విషయం కాదు. కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన నాలుగైదు సంవత్సరాలలోనే ఫేడౌట్ అయిపోతుంటే ఈమె మాత్రం 20 సంవత్సరాల పాటు తన కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఆమె ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని లాంగ్వేజ్ ల్లో నటిస్తూ నటి గా మంచి గుర్తింపు పొందడమే కాకుండా తనదైన రీతిలో సక్సెస్ లను కూడా అందుకుంటుంది. ఇక రీసెంట్ గా తమిళంలో ‘అర్మునునై ‘అనే సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఆమె హీరోయిన్ గానే కాకుండా ఐటెం భామగా కూడా చిందులు వేస్తూ ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ఇప్పటివరకు తను ‘జైలర్ ‘ సినిమాలో చేసిన ‘నువ్వు కావాలయ్యా’ అనే సాంగ్ ఆల్ టైం ఐటెం సాగ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు నటించిన ‘స్ట్రి 2’ సినిమా నుంచి ఆమె చేసిన ఐటెం సాంగ్ ఒకటి రిలీజ్ అయింది.

    Also Read: ఆ హీరోయిన్ తో సాయిధరమ్ తేజ్ లవ్ మ్యారేజ్.. మెగా ఇంట్లో మరో పెళ్లి.. అసలు క్లారిటీ వచ్చేసిందిగా!

    దానికి కూడా మంచి ఆదరణ దక్కుతుంది. ఇక ఇదే సమయంలో ఐటెం సాంగ్స్ చేసే నోరా ఫతేహి తో తమన్నాను పోల్చి చూస్తున్నారు. నిజానికి తమన్న ఒక టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్స్ చేయాల్సిన అవసరం తనకు లేదు. కానీ నోరా మాత్రం ఎప్పుడు ఐటెం సాంగ్స్ చేస్తూనే ఉంటుంది. ఒక ఐటెం బామ తో టాప్ హీరోయిన్ ని పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది తమన్నా అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మరి కొంత మంది మాత్రం తమన్నా తన స్టెప్పులతో, తన అందాలతో నోరా ను మ్యాచ్ చేయలేకపోతుంది అంటున్నారు. ఇక మొత్తానికైతే తమన్నా అటు హీరోయిన్ గా,ఇటు ఐటెం భామ గా రెండు రకాల పాత్రలను పోషిస్తూ భారీగా సంపాదిస్తుందనే చెప్పాలి.

    ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో ‘ఓదెల రైల్వే స్టేషన్ 2’ సినిమాలో నటిస్తుంది. ఇక దాంతో పాటుగా పలు క్రేజీ సబ్జెక్టులను కూడా ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్నా కూడా తమన్నా జోరు ఇంకా తగ్గడం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరి సరసన నటించే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే తమన్నా మరికొన్ని సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తన సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది.

    ముఖ్యంగా తమన్నా ఇన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం ఏంటి అంటే ఆమె డాన్స్ అనే చెప్పాలి. ఆమె హీరోలకు తగ్గట్టుగా పర్ఫామెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె ఎక్కువ రోజులపాటు ఇండస్ట్రీలో తన మనుగడను కొనసాగించగలుగుతుంది అనేది మాత్రం వాస్తవం… మరి ఇక మీదట కూడా మంచి సినిమాలను చేసి భారీ సక్సెస్ లను అందుకుంటుందా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ రావాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్నా లాంటి హీరోయిన్ సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే చిరంజీవి లాంటి టాప్ హీరో పక్కన ఆడి పాడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నాగ్ సరసన కూడా ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…

    Also Read: పుష్ప 2 లో క్యామియో రోల్స్ ప్లే చేస్తున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?