https://oktelugu.com/

Devara: దేవర సినిమాలో కీలక పాత్రను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. ఇక వీళ్ళు సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : August 6, 2024 / 12:11 PM IST

    Devara

    Follow us on

    Devara: సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలు చేయడానికి కొంతమంది నటులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్లకు అనుకున్న పాత్రలు దొరకవు. కొందరు మాత్రం రోటీన్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ అలాంటి వారి దగ్గరికే ఎక్కువగా వైవిధ్యమైన పాత్రలు వెళ్తూ ఉంటాయి. ఇక ఇక్కడ ఏది జరిగిన కూడా ఫైనల్ గా సినిమా సక్సెస్ అయిందా లేదా అనేదే ఇక్కడ కీలక పాత్ర వహిస్తుంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. ఇక వీళ్ళు సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి తారక రామారావు గారు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించి చాలా కాలం పాటు ఇండస్ట్రీని ఏకచత్రాధిపత్యంతో ఏలినా విషయం మనకు తెలిసిందే… ఇక పౌరాణికాల్లో ఆయన పోషించిన పాత్రలను పోషించే నటులు ఈ జనరేషన్ లో కూడా ఎవరూ లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… అలాంటి తారక రామారావు గారి ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సినిమాలను చేస్తూ సక్సెస్ లను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో ఎంతో కొంత వైవిధ్యన్నైతే ప్రదర్శిస్తుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన రొమాంటిక్ సాంగ్ కి కూడా మంచి వ్యూయర్షిప్ ని సొంతం చేసుకుంటూ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక నటుడుని సంప్రదించారట. కానీ ఆయన ఆ పాత్రను చేయనని చెప్పడంతో కన్నడ ఆర్టిస్ట్ ని ఆ క్యారెక్టర్ లో తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది…ఇక ఇంతకీ ఆ పాత్ర ఏంటి ఈ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసిన హీరో ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

    akkineni nagarjuna

    నిజానికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో సినిమాలో అవకాశం వస్తే ప్రతి ఒక్కరు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈ జనరేషన్ లో ఉన్న హీరోలు సోలోగా రాణించాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఈ సినిమాలో దేవర పాత్రని అంటిపెట్టుకొని ఉండే ఒక క్యారెక్టర్ ఉందట… ఆ క్యారెక్టర్ లో తెలుగు స్టార్ హీరో అయిన నాగార్జున ను తీసుకోవాలని కొరటాల శివ అనుకొని నాగార్జునకి కూడా ఆ కథ వినిపించాడట.

    కానీ నాగార్జున మాత్రం ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసినట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి…ఇక ఆ పాత్ర బాగానే ఉంది. కానీ నేను ఆ పాత్రకి సెట్ అవ్వనని చెప్పి నాగార్జున దానిని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. నిజానికి ఎన్టీఆర్ తో పాటు ఈ పాత్రకి సినిమాలో మంచి గుర్తింపు అయితే ఉంటుందట. ఇక అందుకే ఆ పాత్రను కూడా తెలుగు హీరో చేస్తే బాగుంటుందని సినిమా యూనిట్ అనుకున్నారు.

    కానీ నాగార్జున మాత్రం దానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఇప్పుడు ఈ పాత్రలో కన్నడ నుంచి ఒక నటుడుని తీసుకున్నారట. మరి అ నటుడు ఎవరు అనేది ఇప్పుడైతే రివిల్ చేయడం లేదు. కానీ అది సినిమాలో మాత్రమే సస్పెన్స్ గా రివీల్ చేస్తామని చెప్తున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో అటు ఎన్టీఆర్, ఇటు కొరటాల శివ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…