Vikram: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యాక్టింగ్ అంటే ఎలా ఉంటుందో చేసి చూపించి తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కమల్ హాసన్…మనలో ఎవరైనా కొంచెం యాక్టింగ్ బాగా చేస్తే చాలు కమల్ హాసన్ లా చేస్తున్నావ్ అంటుంటారు. అలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో యాక్టింగ్ లో ఆయన ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేశాడు. కమల్ హాసన్ తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ఇండియన్ స్క్రీన్ మీద తనదైన ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. తన 50 సంవత్సరాల సినీ కెరియర్ లో ఇండస్ట్రీ కి చాలా రకాల సేవలను అందిస్తూనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా కూడా పేరును సంపాదించుకున్నాడు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి యాక్ట్ చేయడంలో కమల్ హాసన్ ని మించినటువంటి నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికీ కూడా కమల్ హాసన్ కోసమే కొన్ని కథలను రాసుకుంటున్నారు అంటే ఆయన చరిష్మా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం, దశావతారం లాంటి సినిమాలు ఆయన నటన ప్రతిభను చూపించడమే కాకుండా ఆయన పడిన కష్టాన్ని కూడా స్క్రీన్ మీద మనకు తెలియజేస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలోనే కమల్ హాసన్ నటించిన ఒకప్పటి సూపర్ హిట్ సినిమాని ఒక స్టార్ హీరో రీమేక్ చేయాలని చూస్తున్నాడు…
Also Read: గజిని తర్వాత నుంచి కంగువ వరకు సూర్య చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటో తెలుసా..
కానీ కమల్ హాసన్ సినిమాలను రీమేక్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరమైతే ఉంది. ఏమాత్రం తేడా కొట్టిన కూడా చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్టింగ్ పరంగా కమల్ హాసన్ ఒక స్టాండర్డ్ ను సెట్ చేశాడు. కాబట్టి దాన్ని రీచ్ చేసే లెవెల్లో యాక్టింగ్ చేయగలమనే నమ్మకం ఉన్నప్పుడే సాహసాలు చేయాలని చాలామంది సినీ మేధావులు సైతం హెచ్చరికలను జారీ చేస్తున్నారు…ఇక మొత్తానికైతే కమల్ హాసన్ సినిమాలను రీమేక్ చేయాలనుకున్న ఆ స్టార్ హీరో ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా పేరుపొందిన విక్రమ్…
ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కమల్ హాసన్ చేసిన సినిమాలను ఎక్కువగా చూస్తూ ఆయన నుంచే చాలా వరకు యాక్టింగ్ ఇన్స్పిరేషన్ ను పొందరట. అందుకే విక్రమ్ కూడా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని డిఫరెంట్ పాత్రలను పోషించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. కమల్ హాసన్ చేసిన సాగర సంగమం సినిమాని వీలైతే తను రీమేక్ చేయాలని ఉందని ఒకానొక సందర్భంలో తాను తెలియజేశాడు. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న చాలామంది సినీ మేధావులు అలాగే సినీ విమర్శకులు సైతం కొన్ని విమర్శలు చేశారు.
ఇక మొత్తానికైతే కమల్ హాసన్ నటనని రీక్రియేట్ చేసే కెపాసిటీ విక్రమ్ లో ఉంది. కానీ 100 పర్సెంట్ ఆయన్ని మ్యాచ్ మాత్రం చేయలేడనే చెప్పాలి. ఎందుకంటే కమల్ హాసన్ తప్ప ఆయన సినిమాలో మరొకరిని మనం ఊహించుకోలేము. ఆయన నటన ను మరిపించేలా నటించాలంటే అది ఏ నటుడి కి అయిన చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి. ఇక మొత్తానికైతే కమలహాసన్ సినిమాల్లో ఒక సినిమాను రీమేక్ చేయాలని ఉందని విక్రమ్ తన కోరికను బయట పెట్టడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి…
Also Read: 13 డిజాస్టర్ల తర్వాత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో…