https://oktelugu.com/

Trivikram Srinivas: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా మీద వీడిన సస్పెన్స్..ఆ స్టార్ హీరోతో సినిమాకి సిద్ధం…

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి మంచి గుర్తింపు అయితే ఉంటుంది. అందుకే మన దర్శక నిర్మాతలు ఒకసారి పని చేసిన హీరోలతో మరోసారి పని చేసి వాళ్ల కాంబినేషన్ మీద భారీ హైప్ క్రియేట్ చేసుకోవాలని చూస్తుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 7, 2024 / 09:24 AM IST

    Trivikram Srinivas

    Follow us on

    Trivikram Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్…ఒకప్పుడు రైటర్ గా తన స్టామినా చూపించిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా తన సత్తా చూపిస్తూ టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘అలా వైకుంఠపురంలో ‘ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా తీవ్రంగా నిరశపరచడంతో ఆయన ఇమేజ్ మొత్తం డామేజ్ అయిపోయిందనే చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు అనే విషయాల మీద గత కొద్ది రోజుల నుంచి సరైన క్లారిటీ రావడంలేదు. ఇక గతకొన్ని నెలల నుంచి త్రివిక్రమ్ మీద చాలా రూమర్లైతే వస్తున్నాయి. గుంటూరు కారం సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాను అంటూ అనౌన్స్ చేశాడు. ఇక ఇప్పుడు ‘గుంటూరు కారం’ తేడా కొట్టడంతో అల్లు అర్జున్ కూడా డేట్స్ ఇవ్వడం లేదంటూ కొద్దిరోజుల నుంచి విపరీతమైన వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబోలో సినిమా ఉందా లేదా అనే విషయం మీద రీసెంట్ గా బన్నీ వాసు ఒక క్లారిటీ ఇచ్చే అయితే ఇచ్చారు. ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో రాబోయే సినిమా భారీ బడ్జెట్ తో తెరక్కబోతుందని పాన్ ఇండియా సినిమాగా రాబోతుందంటూ ఆయన ఒక హింట్ అయితే ఇచ్చాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్లిద్దరి కాంబోలో ఒక పిరియాడికల్ డ్రామా సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. త్రివిక్రమ్ ఒక మంచి కథని అల్లు అర్జున్ కోసం రెడీ చేశారట.

    ఇక బడ్జెట్ విషయానికొస్తే ఈ సినిమాకి దాదాపు 300 నుంచి 400 కోట్లకు పైన బడ్జెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 2025వ సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. తొందర్లోనే ఈ సినిమాని అనౌన్స్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని త్రివిక్రమ్ పూర్తి చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పుష్ప 2 సినిమా షూట్ కూడా చివరి దశకు వచ్చింది. కాబట్టి లేట్ చేయకుండా త్రివిక్రమ్ సినిమాని స్టార్ట్ చేయాలని అల్లు అర్జున్ చూస్తున్నట్లు తెలుస్తుంది.

    ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత సంచలన దర్శకుడి గా పేరు పొందిన ‘సందీప్ రెడ్డి వంగ’ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగ గత సంవత్సరం ‘అనిమల్’ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని నన్ను మించిన దర్శకుడు మరోకరు లేరు అనేలా గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.

    ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలాంటి పాయింట్స్ తో తెరకెక్కుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ వరుసగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తూ వరుస లైనప్ ను సెట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…