Super Singer Junior: బుల్లితెర నటుడిగా సుడిగాలి సుధీర్ సుపరిచితుడే. కమెడియన్, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తన ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ తో పాటు పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నారు. మరోవైపు ఎక్స్ ట్రా జబర్దస్త్ లో తన స్కిట్లతో ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. సుధీర్ వ్యాఖ్యాతగా కూడా మంచి మార్కులే సంపాదించుకుంటున్నాడు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అందరిని మైమరపిస్తున్నాడు. బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా స్థానం దక్కించుకున్నాడు.

సుధీర్ యాంకర్ గా మరో షో రానుంది. ఇప్పటికే పలు షోల్లో తన మాటలతో ఆకర్షిస్తున్న సుధీర్ స్టార్ మా నిర్వహించే ఓ చిన్నారుల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారనున్నాడు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల కోసం సూపర్ సింగర్ జూనియర్ పేరుతో ఓ కొత్త సిరీస్ ప్రారంభించనున్నారు. దీనికి సుధీర్ తోపాటు అనసూయ కూడా యాంకర్లుగా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే పిల్లలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా ఎంట్రీలు పంపినట్లు తెలుస్తోంది.
ఇందులో 14 మంది బాలలు టాప్ కంటెస్టెంట్ల్స్ గా ఎంపికైనట్లు చెబుుతున్నారు. వీరితో సూపర్ సింగర్ జూనియర్ సిరీస్ ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమానికి సుధీర్, అనసూయ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఎన్నో కార్యక్రమాల్లో తన అందాలతో అదరగొడుతున్న అనసూయ కూడా వ్యాఖ్యాతగా మంచి స్థానాన్ని సంపాదించుకుంది. జబర్దస్త్ వేదిక తోనే అందరు ఎదిగినట్లు తెలిసిందే. దీంతో ఈ షో కూడా మంచి ఆదరణ తీసుకొస్తుందని చెబుతున్నారు.

ఈ షోకు ప్రముఖ గాయని చిత్ర, గాయకులు రెనినా రెడ్డి, హేమచంద్ర జడ్జిలుగా వ్యవహరించనున్నారు. ఈ షో మే 22న ప్రారంభం అయింది. ప్రతి శని, ఆదివారాలు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. దీంతో బాలల్లో ఉన్న టాలెంట్ ను పైకి తీసుకొచ్చే క్రమంలో నిర్వహించే ఈ షో మరో సంచలనం కానుందని బుల్లితెర ప్రేక్షకుల వాదన. మొత్తానికి సుధీర్, అనసూయ ఒకే వేదిక మీద సందడి చేయనున్నట్లు సమాచారం.
Also Read: Reduced Petrol, Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధర తగ్గించని ఏపీ సర్కారు? కేంద్ర సూచనలు బేఖాతరు
సుధీర్ తోపాటు అనసూయ కూడా ఉండటంతో షో కు మరింత స్పందన రానుంది. ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. సుధీర్ లో ని టాలెంట్ అనసూయలోని అందం అందరికి ఆహ్లాదకర విందు చేయనున్నట్లు చెబుతున్నారు. బుల్లితెరలో మరో అద్భుతమైన షోగా సూపర్ సింగర్ జూనియర్ అవతరించనుందని బుల్లితెర వర్గాల భోగట్టా.

Also Read: Misses Vizag 2022: శ్రీమతులు.. ‘మతులు’ పోగొట్టారు..
Recommended videos
[…] […]
[…] […]