https://oktelugu.com/

Rajamouli – Mahesh Babu: రాజమౌళి మహేష్ సినిమాలో నటించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

బాహుబలి సినిమా 500 కోట్లు కలెక్ట్ చేస్తే, బాహుబలి 2 2000 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇండియాలో ఇప్పటివరకు అంత కలెక్ట్ చేసిన సినిమా లేకపోవడం విశేషం.

Written By:
  • Gopi
  • , Updated On : March 20, 2024 / 10:20 AM IST

    Raveena Tandon in in Rajamouli Mahesh Movie

    Follow us on

    Rajamouli – Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళిని మించిన దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన కష్టాన్ని నమ్ముకొని ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ పాన్ ఇండియా స్థాయిలో తన స్టామినా ఏంటో చూపించాడు. బాహుబలి సినిమా 500 కోట్లు కలెక్ట్ చేస్తే, బాహుబలి 2 2000 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇండియాలో ఇప్పటివరకు అంత కలెక్ట్ చేసిన సినిమా లేకపోవడం విశేషం. ఇక త్రిబుల్ ఆర్ సినిమా 1200 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది.

    ఇక ఇప్పుడు మహేష్ బాబుతో 1000 కోట్ల బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కనక సక్సెస్ అయితే తెలుగు సినిమా గురించి వరల్డ్ లో చాలా గొప్పగా చెప్పుకుంటారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా మే నెల చివరి వారం నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతూన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ అయితే బయటికి వచ్చింది. అది ఏంటి అంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అయిన రవీనా టాండన్ కీలకపాత్రలో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటికీ ఈమె కేజీఎఫ్ 2 సినిమాలో ప్రధానమంత్రి క్యారెక్టర్ ను పోషించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో తలుక్కున మెరవబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పటివరకు రివిల్ అయితే చేయలేదు గానీ, ఈమె మాత్రం ఈ సినిమాలో నటించబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

    బాహుబలి లో రమ్యకృష్ణ కోసం ఎలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే రాజమౌళి డిజైన్ చేశాడో. ఇక ఈమె కోసం కూడా అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని రాజమౌళి తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి రాజమౌళి ఎప్పుడు అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తాడు అని అందరూ ఎదురుచూస్తున్నారు…చూడాలి మరి జక్కన్న ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతాడో…