https://oktelugu.com/

Director Shankar: తమిళ్ డైరెక్టర్ శంకర్ కి రెండు సార్లు హ్యాండ్ ఇచ్చిన మన స్టార్ హీరో…

తెలుగులో ఒక హీరోకి మాత్రం రెండుసార్లు ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని వదిలేసుకున్నాడు. ఆ హీరో ఎవరు అంటే ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా...

Written By:
  • Gopi
  • , Updated On : March 12, 2024 / 04:40 PM IST

    Director-Shankar

    Follow us on

    Director Shankar: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ శంకర్ కి ఉన్న క్రేజ్ మరే దర్శకుడికి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే శంకర్ చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన అంశమైతే ఉంటుంది. అందువల్లే అందరు శంకర్ ను, మిగతా డైరెక్టర్లను సపరేట్ చేసి చూస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే శంకర్ తో సినిమా చేయడానికి అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

    కానీ తెలుగులో ఒక హీరోకి మాత్రం రెండుసార్లు ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని వదిలేసుకున్నాడు. ఆ హీరో ఎవరు అంటే ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్(Rajashekar)…శంకర్ జెంటిల్ మెన్ సినిమా ను మొదట రాజశేఖర్ తో చేయాలని అనుకున్నాడట..కానీ అది శంకర్ కి మొదటి సినిమా కావడం వల్ల రాజశేఖర్ కి తనమీద నమ్మకం లేక ఆ సినిమాను వదిలేసుకున్నాడు. ఇక ఆ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో, అర్జున్ తన కెరియర్ లో ఒక్కసారిగా టాప్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఈ సినిమా తర్వాత మరోసారి ఒకే ఒక్కడు సినిమా కోసం రాజశేఖర్ ని అడిగాట..

    అప్పుడు కూడా రాజశేఖర్ కొన్ని సినిమాలతో చాలా బిజీగా ఉండటం వల్ల ఆ సినిమాని వదిలేశాడు. ఇక మొత్తానికైతే ఆ సినిమాని అర్జున్ సక్సెస్ ఫుల్ గా చేసి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు… ఈ రెండు సినిమా లను రాజశేఖర్ చేసినట్లయితే ఆయన కెరియర్ మరొక రేంజ్ లో ఉండేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి క్రమంలో ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాడు. కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు.

    ఇక ఇది ఇలా ఉంటే అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది అప్పుడే మనం డోర్ తీయాలి. కానీ రాజశేఖర్ కి శంకర్ రూపం లో రెండుసార్లు అదృష్టం తలుపు పెట్టిన కూడా ఆయన తెలుసుకోలేక పోయాడు అంటూ మరి కొంతమంది రాజశేఖర్ మీద కామెంట్లు చేస్తున్నారు…