https://oktelugu.com/

Srikanth: బాహుబలికి కట్టప్పా.. దేవరకు శ్రీకాంత్? ఆ రోల్ లో మెప్పిస్తారా?

ఇక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా దేవర. కాబట్టి ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు అభిమానులు. ఇప్పటికే చిత్ర యూనిట్ వదిలిన పోస్టర్ల వల్ల సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు నెటిజన్లు.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 20, 2023 / 04:16 PM IST
    Follow us on

    Srikanth: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫుల్ ఖుషీ అవుతుంటారు ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమాతో థియేటర్లలో సందడి చేయడానికి సిద్దమయ్యారు. ఈ పాన్ ఇండియా స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న దేవర సినిమా రూ.300 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించనుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఇక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా దేవర. కాబట్టి ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు అభిమానులు. ఇప్పటికే చిత్ర యూనిట్ వదిలిన పోస్టర్ల వల్ల సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతుంటుంది. ప్రస్తుతం కూడా అలాంటిదే ఒకటి వైరల్ గా మారింది. అయితే ఇంటర్వెల్ సీన్ లో దేవర ఓల్డ్ లుక్ లో కనిపిస్తారట. అంటే అది ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఇక హీరో శ్రీకాంత్ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఈ ట్విస్ట్, గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా నిలుస్తోందని.. పైగా ఎవరు ఊహించలేని ట్విస్ట్ అని టాక్.

    ఓల్డ్ పాత్రలోని సరికొత్త వేరియేషన్స్ లో కనిపించబోతున్నారట జూ. ఎన్టీఆర్. అయితే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. బాహుబలి సినిమాకు కట్టప్ప ఏ విధమైన పాత్ర పోషించారో.. ఈ సినిమాకు శ్రీకాంత్ కూడా అలాంటి పాత్రనే పోషిస్తున్నారు అని టాక్. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే శ్రీకాంత్ నటించే సినిమాలు మంచి హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఆయన సినిమాలు చూస్తే ఇదే అర్థం అవుతుంటుంది. ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగిన శ్రీకాంత్ ప్రస్తుతం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు కానీ.. హీరో పాత్రను చేయడం లేదు. కానీ ఈ దేవర సినిమాతో శ్రీకాంత్ క్రేజ్ అమాంతం పెరుగుతుందని టాక్.