https://oktelugu.com/

Sridevi Drama Company: హైపర్ ఆది పై కుట్ర.. మనసులో ఉన్న కసిని బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్!

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఎపిసోడ్లో బాహుబలి 2 లోని ఓ సీన్ ని రీ క్రియేట్ చేశారు. బాహుబలి 2 మూవీలో ప్రభాస్ పై నుంచి దేవసేన నడుచుకుంటూ వెళ్లి పడవ ఎక్కుతుంది గుర్తుండే ఉంటుంది కదా.

Written By:
  • S Reddy
  • , Updated On : May 2, 2024 / 09:48 AM IST

    Sridevi Drama Company

    Follow us on

    Sridevi Drama Company: హైపర్ ఆది తన స్వశక్తితో ఎదిగాడు. తన ఫ్యామిలీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో జాబ్ మానేసి మరీ జబర్దస్త్ కి వచ్చాడు. టాలెంట్ నమ్ముకుని పైకి వచ్చాడు. టీం మెంబర్ గా చేస్తూ తక్కువ సమయంలోనే లీడర్ అయ్యాడు. జబర్దస్త్ షో వల్ల ఆది ఫేట్ మారిపోయింది. ఫుల్ క్రేజ్ సంపాదించాడు. బుల్లితెర స్టార్ కమెడియన్ గా పాప్యులర్ అయ్యాడు. ప్రస్తుతం ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తున్నాడు. వెండితెరపై కూడా కమెడియన్ గా ఆఫర్స్ పట్టేస్తున్నాడు.

    కాగా హైపర్ ఆది ఎదుగుదల చూసి ఓ జబర్దస్త్ కమెడియన్ తట్టుకోలేక పోతున్నాడట. ఆది ని చూస్తుంటే అతనికి అసూయగా ఉందట. ఎప్పటి నుంచో ఆది ని తొక్కేయాలని, వెనక్కి లాగాలని చూస్తున్నాడట. ఇప్పుడు ఆ అవకాశం రావడంతో నిజస్వరూపం బయట పెట్టాడు. అందరి ముందు తన మనసులో ఉన్న ద్వేషం వెళ్లగక్కాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ..

    శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఎపిసోడ్లో బాహుబలి 2 లోని ఓ సీన్ ని రీ క్రియేట్ చేశారు. బాహుబలి 2 మూవీలో ప్రభాస్ పై నుంచి దేవసేన నడుచుకుంటూ వెళ్లి పడవ ఎక్కుతుంది గుర్తుండే ఉంటుంది కదా. అదే మాదిరిగా హైపర్ ఆది పై నుండి నరేష్ నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆగి మెడపై కాలు వేసి తొక్కుతూ కాసేపు ఊపాడు. దీంతో ఆది కింద పడిపోయాడు. నరేష్ కూడా కిందకి దూకాడు. దీంతో ఒక కాలు టేబుల్ పై పెట్టావు మరోకాలు నాపై పెట్టి ఎందుకు రా తొక్కుతున్నావు అని హైపర్ ఆది అడిగాడు.

    దీంతో నరేష్ ‘ ఎప్పటికైనా నిన్ను తొక్కాలన్నది నా ఆశ ‘ అని చెప్పాడు. ఆ డైలాగ్ తో ఆది తో సహా అంతా నవ్వారు. కామెడీ కోసం నరేష్ అలా చెప్పడంతో ఆది కూడా ఫన్నీగా తీసుకున్నాడు. ఆ తర్వాత తాగుబోతు రమేష్ పై నుండి నడవడానికి రోహిణి వచ్చింది. ఆమెను చూసి రమేష్ షాక్ అయ్యాడు. వద్దు బాబోయ్ అంటూ అక్కడ నుంచి పారిపోయాడు. ఇదంతా నవ్వులు పూయించే విధంగా ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.