https://oktelugu.com/

Sreemukhi: ఆ డ్యాన్సులేంది.. ఆ డ్రెస్సులేందమ్మా.. శ్రీముఖి పరువు తీస్తోన్న తల్లి

బుల్లితెర మీద శ్రీముఖి తోపు యాంకర్. కొన్ని కొన్ని సార్లు అతి అనిపించినప్పటికీ.. మరికొన్నిసార్లు ఆమె వస్త్రధారణ ఇబ్బంది కలిగించినప్పటికీ.. యాంకరింగ్ విషయంలో సుమ తర్వాత ఆ స్థాయిలో స్పాంటేనిటీ శ్రీముఖి సొంతం.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 2, 2024 / 09:10 AM IST

    Sreemukhi

    Follow us on

    Sreemukhi: వయసు పెరుగుతున్న కొద్దీ హుందాతనం పెరగాలి. చేసే పనులతో సమాజానికి ఆదర్శంగా నిలవాలి. మిగతా వారేమో గాని ఈ విషయంలో సెలబ్రిటీలకు చాలా బాధ్యత ఉండాలి. సెలబ్రిటీల కుటుంబ సభ్యులకు మరింత ఆ బాధ్యత మరింత ఎక్కువ ఉండాలి. ఫేమ్ ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే అభాసుపాలు కావాల్సి వస్తుంది. అప్పుడు పరుగు గంగ పాలవుతుంది.. ఇప్పుడు అసలే సోషల్ మీడియా కాలం కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.. కామెంట్స్ తో నెటిజెన్లు ఏకిపారేస్తుంటారు.. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిని ప్రముఖ యాంకర్ శ్రీముఖి మాతృమూర్తి ఎదుర్కొంటున్నారు.

    బుల్లితెర మీద శ్రీముఖి తోపు యాంకర్. కొన్ని కొన్ని సార్లు అతి అనిపించినప్పటికీ.. మరికొన్నిసార్లు ఆమె వస్త్రధారణ ఇబ్బంది కలిగించినప్పటికీ.. యాంకరింగ్ విషయంలో సుమ తర్వాత ఆ స్థాయిలో స్పాంటేనిటీ శ్రీముఖి సొంతం. శ్రీముఖి సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. శ్రీముఖి ఎలాగూ రచ్చ రచ్చ చేస్తుంది కాబట్టి ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆమె మాతృమూర్తి చేస్తున్న పనులే కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నాయి.

    శ్రీముఖి మాతృమూర్తికి Latha Srees పేరుతో ఇన్ స్టా గ్రామ్ లో ఖాతా ఉంది. అందులో ఆమె ఇటీవల చేసిన ఒక రీల్ వివాదాస్పదంగా మారింది. ఈ రీల్ లో ఆమె వస్త్రధారణ ఆమె వయసుకు తగ్గట్టుగా లేదు. సరే ఆమె ఇష్టం, ఏం ధరించాలో? ఎలా ఉండాలో? అది ఆమె ఛాయిస్. కానీ సెలబ్రిటీ తల్లి అనే హోదా ఉన్నప్పుడు కచ్చితంగా దానిని మెయింటైన్ చేయాలి. అంతటి స్థాయి చరిష్మా ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి. అంతేగాని ఎలాగూ జనం చూస్తున్నారు కదా అని ఏది పడితే అది తీస్తే.. ఎలా పడితే అలా వస్త్రధారణ చేసుకుంటే జనం నవ్వుతారు. కామెంట్స్ ఆప్షన్ హిడెన్ చేసుకున్నంత మాత్రాన.. జనం ఏమనుకోవడం లేదంటే పొరబాటే. కామెంట్స్ హిడెన్ చేసుకున్నారు అంటే.. అది ఎలాంటి కంటెంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగానే చెప్పినట్టు సెలబ్రిటీలకు బాధ్యత ఉండాలి. వారి కుటుంబ సభ్యులకు అది మరింత ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సమాజం వారికి చాలా ఇచ్చింది. అలాంటప్పుడు సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని వారు మసలుకోవాలి.