Venu Swamy: మొత్తం బంగారమే.. వేణుస్వామి కాదు.. చిలిపి స్వామినే!

ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత . వేణు స్వామి ప్రస్తావన పెద్దగా రాలేదు. అయితే వేణు స్వామి ఆమధ్య చేసిన వ్యాఖ్యలు కలకాలం సృష్టించాయి. వివాదానికి కారణమయ్యాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : April 2, 2024 8:40 am

Venu Swamy

Follow us on

Venu Swamy: వేణు స్వామి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సెన్సేషన్. జాతకాలు చెబుతూ.. హీరోయిన్లతో పూజలు జరుపుతూ.. వారి పేర్లల్లో చిన్న చిన్న మార్పులు చేస్తూ.. అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో.. నిత్యం వార్తల్లో ఉంటారు. అది వివాదం కావచ్చు.. సంచలనం కావచ్చు. ఏదైనా సరే మీడియాలో వేణు స్వామి నానుతూనే ఉంటారు. అలాంటి వేణు స్వామి గత ఎన్నికల సమయంలో చెప్పిన ప్రిడిక్షన్ వాస్తవానికి దగ్గరగా ఉంది. దీంతో అప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ ఆయన సేవలో తరించాయి. ఆయన ఇంటర్వ్యూలకు పోటీపడ్డాయి.

ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత . వేణు స్వామి ప్రస్తావన పెద్దగా రాలేదు. అయితే వేణు స్వామి ఆమధ్య చేసిన వ్యాఖ్యలు కలకాలం సృష్టించాయి. వివాదానికి కారణమయ్యాయి. హిందుత్వాన్ని ప్రచారం చేసే ఆయన గోవాలో తనకు మద్యం దుకాణాలు ఉన్నాయని నేరుగా చెప్పడం అప్పట్లో దుమారానికి కారణమైంది. ఆ తర్వాత ఆయన వివరణ ఇవ్వడంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. అనంతరం ఆయన కొన్ని ఇంటర్వ్యూ లతో ఆ వివాదం తాలూకు నెగిటివిటీని పక్కకు తప్పించారు. జ్యోతిష్య నిపుణుడిగా వేణు స్వామిని సినిమా వాళ్లు విపరీతంగా ఆరాధిస్తారని టాక్ ఉంది. అప్పట్లో ఆయన డింపుల్ హయాతి తో పూజలు కూడా జరిపించారు. మరొక నటి కూడా ఆయన ఆశ్రమంలో పూజలు చేశారు. అప్పట్లో వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.

తాజాగా వేణు స్వామి ఓ ఫేస్ బుక్ రీల్ లో కనిపించారు . మిర్చి సినిమాకు పేరడీగా అందులో వేణు స్వామి ప్రభాస్ లాగా కనిపించారు. మరో యువతి అనుష్క అవతారం ఎత్తి వేణు స్వామిని సరదాగా ఆటపట్టించారు. ప్రస్తుతం ఈ రీల్ రెండు మిలియన్ల వ్యూస్ నమోదు చేసింది. 89,000 మంది లైక్స్ సొంతం చేసుకుంది. ఈ రీల్ చూసిన చాలామంది వేణు స్వామి మామూలోడు కాదంటూ కామెంట్ చేస్తున్నారు . పైగా ఈ రీల్ లో వేణు స్వామి అచ్చం ప్రభాస్ లాగా హెయిర్ స్టైల్ చేసుకోవడం విశేషం.