Siri Hanmanth: బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ జబర్దస్త్ షో యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఓ జబర్దస్త్ కమెడియన్ కి సిరి ఐ లవ్ యు చెప్పి షాక్ ఇచ్చింది. స్టేజ్ పై అందరి ముందు ప్రపోజ్ చేసింది. దీంతో ఆ కమెడియన్ ఆనందంలో తేలిపోయాడు. ఇంతకీ సిరి మనసు దోచేసిన ఆ కమెడియన్ ఎవరు? అసలు సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం?
సోషల్ మీడియా ద్వారా సెలెబ్రెటీలు గా మారిన వారిలో సిరి హన్మంత్ ఒకరు. యూట్యూబ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయింది సిరి. పలు వెబ్ సిరీస్, షాట్ ఫిలిమ్స్ లో నటించింది. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్లలో ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి.
కాగా గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో ఓ కమెడియన్ కి ఆమె ప్రపోజ్ చేసింది. అతనెవరో కాదు ‘ వెంకీ మంకీస్ ‘ టీం లీడర్ వెంకీ. ఈ క్రమంలో వెంకీ, శాంతి స్వరూప్, తాగుబోతు రమేష్ లతో కలిసి స్కిట్ చేసాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సిరి వస్తుంది అని పంతులు చెప్పాడని .. అందుకే గుడికి వెళుతున్నాను అని వెంకీ రమేష్ తో చెబుతాడు. సిరి అంటే .. ధనం, సంపద. యాంకర్ సిరి కాదు రా అని తాగుబోతు రమేష్ క్లారిటీ ఇస్తాడు.
గుడికి వెళ్లే అడ్రస్ ఉన్న చీటీ పట్టుకుని సిరి దగ్గరకు వెళ్లి ఇందులో ఏం రాసుందో కొంచెం చదివి చెప్పండి అని వెంకీ అడుగుతాడు. ఇక సిరి ఆ చీటీ ఐ లవ్ యూ అని చెప్పింది. అందులో అదే రానుండడంతో ఆ మాటే అంటుంది. దీంతో వెంకీ నాకు సిరి ప్రపోజ్ చేసింది అంటూ తెగ సంతోష పడిపోతాడు. నేనంటే నీకు అంత ఇష్టమా అంటూ వెంకీ అడగ్గా .. బొంగేం కాదు. ఇందులో అదే రాసుంది చదివాను అని సిరి చెప్పింది. దీంతో వెంకీ బోరుమని ఏడుస్తాడు.
అలా స్కిట్ ముగిసింది. కేవలం స్కిట్ కోసం సిరి వెంకీ కి ఐ లవ్ యు చెప్పింది. ఇందంతా వినోదం కోసమే అయినా .. కొందరు నెటిజన్లు మరి శ్రీహాన్ సంగతేంటి .. శ్రీహాన్ కి హ్యాండిస్తావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.