Tillu Cube: టిల్లు భాయ్ అంటే చాలు డీజే టిల్లు అంటారు. ప్రస్తుతం టిల్లు ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించినా రాని గుర్తింపు డీజే టిల్లు సినిమాతో తన పేరున మారుమ్రోగించాడు సిద్దూ జొన్నల గడ్డ. ఈ పేరు కంటే టిల్లు అంటేనే ఫుల్ ఫేమస్. టిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా పోరీ దెబ్బకు అంటూ రెండో పార్ట్ తో కూడా ముందుకు వచ్చాడు. బొమ్మ అదుర్స్ అనిపించుకుంటూ దూసుకొని పోతున్నాడు టిల్లు. డీజే టిల్లు అంటూ టిల్లు మాత్రమేనా అనుకుంటున్నారా? కానీ ఆయన యాస అలాంటిది మరీ అంటారు సిద్ధూ ఫ్యాన్స్.
సిద్దు జొన్నలగడ్డ స్టార్ స్టేటస్ ను సంపాదించి పెట్టిన సినిమా డీజే టిల్లు. ఒక్క డీజే టిల్లుతో ఈయన స్టేటస్ మారిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎనలేని గుర్తింపు ను సంపాదించింది డీజే టిల్లు. ముఖ్యంగా సిద్ధూ లుక్, డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సీక్వెల్ వచ్చినా అది కూడా అబ్బో అదుర్స్ అనేలా దూసుకొని పోతుంది. సినిమా కంటెంట్ కంటే సిద్దు వాడే స్లాంగ్ కే అభిమానులు ఎక్కువ అనడంలో సందేహం లేదు.
సీక్వెల్ గా వచ్చిన సినిమా కూడా ఇప్పటికే రూ. 70 కోట్లు వసూలు చేసింది. దీంతో టిల్లు క్యూబ్ ను కూడా ప్రకటించారు. మరి టిల్లు క్యూబ్ ఎలా ఉండబోతుంది? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే అనుమానాలు ఫుల్ గా ఉన్నాయి. ఈ సందర్భంగా టిల్లు చేసినా కామెంట్స్ వైరల్ గా మారాయి. టిల్లు స్కైర్ వరకు అమ్మాయిలు, మోసం వంటివి ఉన్నాయి. ఇక క్యూబ్ లో సూపర్ పవర్స్ వస్తే హీరో ఏం చేస్తాడు? ఎలా ఉంటాడు? గాల్లో ఎగరడం వంటి పాయింట్ తో కథ ముందుకు సాగుతుందట.
త్వరలోనే దీనికి సంబంధించిన వర్క్ ను కూడా స్టార్ట్ చేస్తాను అంటున్నాడు టిల్లన్నా. ఇప్పటి వరకు క్రైమ్, కామెడీ చుట్టూ తిరిగిన టిల్లు స్టోరీ సడన్ గా సూపర్ హీరో వైపు తిరగడానికి కారణం ఏంటో కానీ.. ప్రస్తుతం సూపర్ హీరో నేపథ్యంలోనే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. మరి ఈ సూపర్ హీరో సిద్ధూకు ఎలాంటి టాక్ ను తెచ్చిపెడుతాడో చూడాలి.