Bigg Boss Telugu OTT: Anchor Shiva: బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి నుంచి ఆసక్తిగా మారింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పాతవారితో పాటు కొత్త కంటెస్టెంట్లు సూపర్ ఫర్ఫామెన్స్ చూపించారు. ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో బిందుమాధవి, అఖిల్ సార్థక్ లు నిలిచారు. అయితే సీజన్ మొత్తం యాక్టివ్ గా టాస్క్ లు పూర్తి చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ శివ. ప్రతీ టాస్క్ ను ఉత్కంఠగా కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఒక దశలో టైటిల్ శివకే దక్కుతున్న ప్రచారం సాగింది. కానీ ఎంత ప్రయత్నించినా శివ మూడో ప్లేసు నుంచి పైకి వెళ్లలేదు. ఈ సీజన్ ఫైనల్ లో యాంకర్ శివకు ముందుగానే సిల్వర్ షూట్ కేస్ అందించగానే అతడికి టైటిల్ రాలేదని అర్థమైంది. అయినా శివ సంతోషంగానే ఎలమినేట్ అయ్యాడు. కానీ సీజన్ మొత్తం ఇంత పర్ఫామెన్స్ చూపించిన శివకు బిగ్ బాస్ చేసింది ఇంతేనా..? అని ఆయన ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి.

యూట్యూబ్ లో కాంట్రవర్సీ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ శివ అనుకోకుండానే బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో శివ గురించి ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఆయన ఆడే గేమ్స్, టాస్క్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా కంటెస్టెంట్లకంటే యాంకర్ శివకు ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు. ఓటింగ్ విషయంలో కొందరు సోషల్ మీడియా వేదికగా సపోర్టు ఇచ్చారు. యాంకర్ శివకు టైటిల్ రావాలని చాలా మంది కోరుకున్నారు. అయితే శివ కంటే బిందుమాధవి, అఖిల్ సార్థక్ లకు ఫాలోయింగ్ ఎక్కువ రావడంతో వారు శివ స్థానాన్ని దాటేశారు.
Also Read: Bigg Boss Winner Bindu Madhavi: బిగ్ బాస్ విజేతగా ఆడపులి ‘బిందు’..తొలి మహిళగా సంచలనం
ఫైనల్ పోరులో శివ టాప్ 3లో ఉన్నా అయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున సైతం అప్పుడప్పుడు శివ చేసే టాస్క్ కు ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసలు కూడా కురిపించారు. దీంతో ఆయనకు బిగ్ బాస్ నుంచి సపోర్టు ఉందని భావించారు. కానీ ఓటింగ్ శాతం తక్కువగా ఉండడంతో వెనుకబడిపోయారు. మరోవైపు టాప్ 3 ప్లేసులో ఉన్న శివ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వేదికపై వచ్చిన ఆయన తన తల్లిదండ్రులను ఆహ్వానించారు. ఆ తరువాత తనకు నెక్ట్స్ సీజన్లోకి వెళ్లే అవకాశం ఇవ్వాలన్నట్లు బిగ్ బాస్ ను కోరారు. దీంతో బిగ్ బాస్ 6కు వెళ్లేందుకు యాంకర్ శివకు రెడ్ కార్పెట్ పడ్డట్లేనా..? అనే చర్చ సాగుతోంది.

ఇదిలా ఉండగా టాప్ 3 కి వచ్చిన శివకు రెమ్యూనరేషన్ ఎంత అనేది డిక్లేర్ చేయలేదు. మాములుగా అయితే ప్రతి కంటెస్టెంట్ కు ప్రతీ వారం పారితోషికం ఇస్తారు. కానీ సీజన్ మొత్తం వంద శాతం ఫర్ఫామెన్స్ చూపించిన శివ రెమ్యూరేషన్ ప్రకటించకపోవడంపై ఆయన ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. వినర్ అయిన బిందు మాధవికి రూ.40 లక్షలు, అరియాగా గ్లోరికీ రూ.10 లక్షలు ప్రకటించారు. కానీ సెకండ్ ప్లేసులో ఉన్న అఖిల్ సార్థక్, శివకు ఎలంటి రెమ్యూనరేషన్ ప్రకటించకపోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
Also Read:Pawan Kalyan CM Candidate: పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్.. టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందస్తు షరతు?