https://oktelugu.com/

Shiv Kumar-Priyanka Jain: డబ్బుల్లేక సహజీవనం చేస్తున్నాం… బాంబు పేల్చిన బిగ్ బాస్ ప్రియాంక ప్రియుడు!

ప్రియాంక హౌస్ నుంచి బయటకు వచ్చాక ఫ్యాన్స్ నుంచి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. శివ్ కుమార్ తో మీ పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు అడిగారు. అయితే 2024 లో మా పెళ్లి ఉంటుంది అని .. పెళ్లి పై తనకు చాలా ఆశలు ఉన్నాయని ప్రియాంక ఆన్సర్ ఇచ్చింది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 3, 2024 / 10:59 AM IST
    Follow us on

    Shiv Kumar-Priyanka Jain: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ సీరియల్ నటుడు శివ్ కుమార్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాం అంటూ ఈ జంట చెప్పుకొచ్చారు. మౌనరాగం సీరియల్ టైం నుంచి ప్రియాంక – శివ్ కుమార్ లు ప్రేమలో ఉన్నారు. కానీ ఎక్కడా వాళ్ళ రిలేషన్ గురించి బయట పెట్టలేదు. మేము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు. అయితే బిగ్ బాస్ వేదికగా వాళ్ళ బంధం గురించి క్లారిటీ ఇచ్చారు.

    ప్రియాంక హౌస్ నుంచి బయటకు వచ్చాక ఫ్యాన్స్ నుంచి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. శివ్ కుమార్ తో మీ పెళ్లి ఎప్పుడు అంటూ అభిమానులు అడిగారు. అయితే 2024 లో మా పెళ్లి ఉంటుంది అని .. పెళ్లి పై తనకు చాలా ఆశలు ఉన్నాయని ప్రియాంక ఆన్సర్ ఇచ్చింది. కాగా పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్న వీరి పై కొందరు నెగిటివ్ కామెంట్స్ పెడుతూ తిట్టిపోస్తున్నారు. మీకు సిగ్గు లేదా .. మీ అమ్మ నాన్న అడగరా అంటూ తిడుతున్నారు.

    తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక జైన్ – శివ్ కుమార్ పెళ్లి, సహజీవనం పై క్లారిటీ ఇచ్చారు. కాగా వారి రిలేషన్ పై ఎవరి కళ్ళు పడకూడదనే ఉద్దేశంతో మేము ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళం అని శివ్ అన్నాడు. ఇక పెళ్లి చేసుకోవాలి అంటే చాలా ఖర్చుతో కూడిన పని .. పైగా ప్రియాంక కు పెళ్లి పై చాలా ఆశలు ఉన్నాయి. ఘనంగా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది అందుకు డబ్బులు కావాలి కదా అని శివ్ చెప్పాడు.

    అయితే వారు సహజీవనం చేయడం పై పలు రకాల విమర్శలు రావడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారట. కానీ ప్రియాంక కు గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనే కోరికలు ఉన్నాయట. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, అందుకే సహజీవనం చేస్తున్నాము అని ప్రియాంక వెల్లడించింది. మౌనరాగం సీరియల్ ముగిసిన నాటి నుంచి వాళ్ళు కలిసి ఉంటున్నారట. వాళ్ళ పేరెంట్స్ కూడా వారి నిర్ణయాన్ని గౌరవించి కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారట. ఏళ్ళుగా కలిసే ఉంటున్నామని ప్రియాంక – శివ్ కుమార్ చెప్పుకొచ్చారు.