Krithi Shetty Remuneration: మన టాలీవుడ్ లో లేటెస్ట్ గా వచ్చిన హీరోయిన్స్ లో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ కృతి శెట్టి..సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మాయి..తోలి సినిమాతోనే భారీ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది..2021 వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సషనల్ హిట్ గా నిలిచింది..55 కోట్ల రూపాయిల థియేట్రికల్ షేర్ ని సాధించి డెబ్యూ సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ ని దక్కించుకుంది..ఈ సినిమా తర్వాత ఈమె ఒక్క తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా వరుస గ క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకుంది..ఈమె తెలుగు ఇప్పటి వరుకు చేసిన సినిమాలు అన్ని సూపర్ హిట్టే..ఉప్పెన తర్వాత ఆమె చేసిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వాటి సినిమాలతో కెరీర్ లో హాట్రిక్ హిట్ కొట్టింది.

ఈ అమ్మాయి హీరోయిన్ గా మన సినిమాలో చేస్తే కచ్చితంగా సూపర్ హిట్ అయ్యిపోతుంది అనే సెంటిమెంట్ ప్రతి ఒక్క దర్శక నిర్మాతలకు పట్టుకుంది..అందుకే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చూసిన కృతి శెట్టి నే కనిపిస్తుంది..ప్రస్తుతం ఆమె హీరో రామ్ పోతినేని తో కలిసి నటించిన వారియర్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది..ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మరియు పాటలకి అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ సినిమా తో పాటుగా ఆమె తమిళ్ లో హీరో సూర్య తో కలిసి ఒక్క సినిమాలో నటిస్తుంది..ఇది ఇలా ఉండగా ఈమె ఒక్కో సినిమాకి 2 కోట్ల రూపాయిలు పారితోషికం గా డిమాండ్ చేస్తుంది అట..తన కోసం ప్రత్యేకంగా వచ్చే యూత్ ఆడియన్స్ ఉండడం తో ఈ అమ్మడు అంత మొత్తం డిమాండ్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..కేవలం యువ హీరోలు మాత్రమే కాదు..స్టార్ హీరోలు కూడా కృతి శెట్టి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఆమె డిమాండ్ ఏ స్థాయిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు.
Also Read: Chandrababu Pawan Kalyan: సంచలనం: సీఎం సీటును పవన్ కళ్యాణ్ కు త్యాగం చేయడానికి చంద్రబాబు ఓకే?

ఇప్పుడు నటిస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా మరో 6 సినిమాల్లో నటించడానికి సంతకం చేసినట్టు తెలుస్తుంది..యువ హీరోల సినిమాలకి 2 కోట్ల రూపాయిల పారితోషికం..అలాగే పెద్ద హీరోల సినిమాలకి 3 కోట్ల రూపాయిల పారితోషికం ని ఈ యువ హీరోయిన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది..అలా ఈ ఏడాది ఈ హీరోయిన్ నుండి తెలుగు మరియు తమిళ బాషల నుండి 8 సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి అట..అంతే దాదాపుగా ఏడాదికి 20 కోట్ల రూపాయలకు పైగానే సంపాదన చేస్తుంది..మాములుగా ఒక్క స్టార్ హీరో ఒక్క సినిమా పూర్తి చెయ్యాలి అంతే కనీసం ఏడాది సమయం పడుతుంది..ఏడాది కి పైగా కష్టపడితే ఒక్క స్టార్ హీరో కి వచ్చే రెమ్యూనరేషన్ 40 కోట్ల రూపాయిలు ఉంటుంది..కానీ కృతి శెట్టి ఒక్క ఏడాది లోనే ఇన్ని సినిమాలు చేస్తూ ఉంటె ఒక్క స్టార్ హీరో ఏడాది సంపాదించే సంపాదనని కూడా ఎదో ఒక్క రోజు కృతి శెట్టి దాటేస్తుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
Also Read: KCR Third Front: ఫ్రంట్ కోసం పట్టు వదలకుండా.. 2024కు కేసీఆర్ రోడ్‌మ్యాప్!!
Recommended Videos