Sherya Dhanvanthari: పద్ధతికి పరికిణి వేసినట్టు ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..

అక్కినేని నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘జోష్’ సినిమాలో శ్రేయా కనిపించింది. ఆ తరువాత సందీప్ కిషన్ తో కలిసి ఆయన మొదటి సినిమా ‘స్నేహ గీతం’లోనూ అలరించింది.

Written By: Chai Muchhata, Updated On : April 25, 2024 12:06 pm

Shreya Dhanvanthari

Follow us on

Sherya Dhanvanthari:  సినిమా ఇండస్ట్రీలోకి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ మంది అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొందరు ఇక్కడే సాంప్రదాయ సినిమాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. మరికొందరు మాత్రం అవకాశాల కోసం ఇతర ఇండస్ట్రీలోకి వెళ్లి తమ సత్తా చాటుతున్నారు. అయితే తెలుగు సినిమాల్లో ఉన్నంత కాలం ‘పద్ధతికి పరికిణి కట్టినట్లు’ ఉండే కొందరు తెలుగమ్మాయిలు ఇతర ఇండస్ట్రీలోకి వెళ్లాక పూర్తిగా మారిపోతున్నారు. హద్దు పద్దు లేకుండా గ్లామర్ షో చేస్తున్నారు. ఇలాగే తెలుగులో అలరించిన ఓ హీరోయిన్ ఇప్పుడు హాట్ హాట్ గా ఉన్న ఫొటోలను రిలీజ్ చేసి కుర్రకారుకు షాకిస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

హైదరాబాద్ లో పుట్టిన ఈమె చిన్న వయసులోనే పరదేశం వెళ్లిపోయింది. కానీ ఢిల్లీలో చదువుకున్న ఈమె ఆ తరువాత ఇంజనీరియంగ్ పూర్తి చేసి మోడల్ రంగంలో అడుగుపెట్టింది. 2008 సంవత్సంలో ‘ఫెమినా మిస్ ఇండియా సౌత్’ పోటీల్లో పాల్గొంది. కానీ ఇందులో రన్నరప్ గా నిలిచింది. ఆ తరువాత మిస్ ఇండియా 2008 పోటీలో పాల్గొని ఫైనలిస్టుగా నిలచింది. ఆ తరువాతు తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. కానీ స్టార్ గుర్తింపు రాలేకపోయింది. ఆమె ఎవరో కాదు శ్రేయా ధన్వంతరి.

Shreya Dhanvanthar2 i

అక్కినేని నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘జోష్’ సినిమాలో శ్రేయా కనిపించింది. ఆ తరువాత సందీప్ కిషన్ తో కలిసి ఆయన మొదటి సినిమా ‘స్నేహ గీతం’లోనూ అలరించింది. ఈ రెండు సినిమాలు ప్లాప్ కావడంతో శ్రేయా ధన్వంతరిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె బాలీవుడ్ లో అవకాశాల కోసం వెళ్లింది. అక్కడ ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించింది. ఆ తరువాత పలు హిందీ సినిమాల్లో నటించింది. ఆ తరువాత ‘ది ఫ్యామిలీ మేన్’, ‘ఏ వైరల్ వెడ్డింగ్’ అనే వెబ్ సిరీసుల్లో నటించడంతో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో శ్రేయా ధన్వంతరి స్టైలిష్ గా మారింది.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు హాట్ హాట్ ఫొటోషూట్ కు ఫోజులిచ్చింది. అయితే ఒకప్పుడు ఎంతో సాంప్రదాయంగా కనిపించిన ఈ భామ కు సంబంధించిన లేటేస్ట్ పిక్స్ చూసి షాక్ అవుతున్నారు. ప్రస్తతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈమ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. తెలుగులోనూ అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. అయితే ఆమె ఫొటోలను చూసిన వారంతా డిఫరెంట్ కామెంట్లు పెట్టి సందడి చేస్తున్నారు.