https://oktelugu.com/

Photo Story: ఈ ఫోటో లో ఉన్న బుడ్డోడు మామూలోడు కాదు…హీరో గా చేసిన మొదటి సినిమాతోనే అవార్డు అందుకున్నాడుగా…

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక అందులో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది ప్లాప్ అవుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 6, 2024 / 03:24 PM IST

    Photo Story

    Follow us on

    Photo Story: సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే చాలు ఎప్పుడో ఒకసారి అవకాశాలు వస్తాయి. అలాగే వాళ్ళు చేసే సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు కూడా సోలోగా వచ్చి వాళ్ల ప్రతిభతో నెంబర్ వన్ హీరోలుగా ఎదిగారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడిప్పుడు కొంతమంది టాలెంటెడ్ నటులు కూడా ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు… అయితే 2011 వ సంవత్సరంలో సుమంత్ హీరోగా వచ్చిన ‘గోల్కొండ హై స్కూల్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒక బుడ్డోడు ప్రస్తుతం స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ బుడ్డోడు ఇప్పుడు ఒక స్థాయిలో నటిస్తూ ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలేవ్వరికి దక్కని క్రేజ్ ను కూడా దక్కించుకుంటున్నాడు. ఆయన ఎవరు అంటే మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ‘సంగీత్ శోభన్’… నిజానికి సంగీత్ శోభన్ ఒక ప్రముఖ దర్శకుడి కొడుకు అనే విషయం కూడా మనలో చాలామందికి తెలియదు. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘వర్షం ‘ సినిమా డైరెక్టర్ అయిన శోభన్ కొడుకే ఈ సంగీత్ శోభన్… ఇక చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం ఉండటంతో గత సంవత్సరం ‘మ్యాడ్ ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు.

    Sangeet Sobhan

    దాంతో ప్రస్తుతం ఆయనకి ‘ ఫిల్మ్ ఫేర్ అవార్డు’ కూడా దక్కింది. ఇక ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ తన కెరియర్ ను చాలా బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే సంగీత్ శోభన్ వాళ్ళ అన్నయ్య కూడా హీరోనే అనే విషయం కూడా ఎక్కువ మందికి తెలియదు. ఆయన ఎవరు అంటే ‘పేపర్ బాయ్’ , ‘రోజులు మారాయి’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘సంతోష్ శోభన్’…ఇప్పుడు వీళ్లిద్దరూ కూడా చిన్న దర్శకులకు అవకాశాలను ఇస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

    ఇక ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇండస్ట్రీలో ఎవ్వరూ సపోర్ట్ లేకుండా ఏ అడ్డంకి రాకుండా జెట్ స్పీడ్ లో ముందుకెళ్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరికీ కూడా ప్రభాస్ చాలావరకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకు మొదటి సక్సెస్ ని అందించిన శోభన్ వాళ్ళ కొడుకులు కావడంతో ప్రస్తుతానికి శోభన్ లేడు కాబట్టి వీళ్ళను ఎంకరేజ్ చేసి శోభన్ మీద ఉన్న కృతజ్ఞతను తెలియజేస్తున్నాడు…

    వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ప్రస్తుతం ఇండస్ట్రీలో రెండు ధ్రువ నక్షత్రాలుగా వెలుగుతున్నారనే చెప్పాలి. ఇక సంగీత్ శోభన్ యాక్టింగ్ కి అయితే ఫిదా కానీ వాళ్లు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సీన్ ఎలాంటిదైనా సరే తన కామెడీ టైమింగ్ తో ఆ సీన్ మొత్తాన్ని కామెడీ సీన్ గా మార్చేస్తాడు. అలాంటి నైపుణ్యం ఉన్న ఈ యాక్టర్ ఫ్యూచర్ లో చాలా గొప్ప స్థాయికి వెళ్తాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు… ఇక ఇప్పుడు వస్తున్న మ్యాడ్ 2 సినిమాలో కూడా తను కీలక పాత్ర వహించబోతున్నట్టుగా తెలుస్తుంది…