https://oktelugu.com/

Samantha: ఫైనల్లీ గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. ఇక రచ్చ రచ్చేనా..?

మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత తన వ్యాధి నయం చేసుకోవడానికి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. గతంలో ఈ వ్యాధితో బాధ పడుతూనే యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పింది. అప్పటి నుంచి ఈమె మయోసైటిస్ తో బాధ పడుతున్న విషయం తెలిసిందే.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 12, 2024 / 12:11 PM IST
    Follow us on

    Samantha: సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె నటించిన ఎన్నో సినిమాలు హిట్ లను సొంతం చేసుకున్నాయి. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఈగ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఇప్పుడు స్టార్ హీరోల ఛాయిస్ హీరోయిన్ గా మారింది. కానీ తన అనారోగ్య కారణంతో కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. అయితే రీసెంట్ గా ఈ అమ్మడు ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత తన వ్యాధి నయం చేసుకోవడానికి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. గతంలో ఈ వ్యాధితో బాధ పడుతూనే యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పింది. అప్పటి నుంచి ఈమె మయోసైటిస్ తో బాధ పడుతున్న విషయం తెలిసిందే. అప్పుడే విడాకులు, వ్యాధి ఇలా ఎన్నో సమస్యలతో బాధ పడిన సామ్ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సినిమాల్లో కనిపించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రేక్షకులతో పంచుకుంది సామ్.

    ఇప్పటికే చాలామంది అభిమానులు నన్ను తిరిగి ఎప్పుడు సినిమాల్లోకి రాబోతున్నారని అడుగుతున్నారు. ప్రస్తుతం ఆ సమయం ఆసన్నమైందని తెలిపింది సమంత. మొత్తం మీద త్వరలోనే తాను సినిమా పనులలో బిజీ కానుందట. ఇక తన అనారోగ్యం వల్ల అందరికీ అవేర్ నెస్ తెచ్చేలా ఒక ఆరోగ్య పోడ్ కాస్ట్ పై కార్యక్రమం చేయబోతుందట సామ్. దీన్ని తన స్నేహితులతో కలిసి చేస్తున్నాను అంటూ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను పంచుకుంటూ సామ్ అభిమానులను సంతోషెట్టింది.

    ఎలాంటి మేకప్ లేకుండా ఎరుపు రంగు డ్రెస్ వేసుకొని నేచురల్ లుక్ లో అలరించింది సామ్. అయితే మరో విషయం ఏంటంటే.. ఈమె ఓన్లీ హీరోయిన్ గా మాత్రమే కాదు నిర్మాతగా కూడా మారబోతుందట. మరి ఈమె ఎంచుకునే అన్ని రంగాల్లో కూడా సక్సెస్ సాధించాలి అనుకుంటున్నారు సామ్ అభిమానులు. ఇక రీ ఎంట్రీతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.