Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి రీసెంట్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రేమించుకున్న ఈ జంట వారి ప్రేమను బయటపెట్టకుండా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు. అందరి అనుమానాలు నిజం చేసి ట్రీట్ ఇచ్చింది ఈ జంట. మొత్తం మీద ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దల అంగీకారంతో ఇటలీలో మూడుముళ్లతో ఒకటయ్యారు. ఇక వీరి పెళ్లి జరిగి నెల రోజులు కూడా గడవక ముందే రూమర్లు మొదలయ్యాయి. వరుణ్ సినిమాల గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా మాట్కా. ఈ సినిమా నిలిచిపోయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బడ్జెట్ భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉండటంతో ఈ సినిమా నిలిపివేశారంటూ ప్రచారం జరిగింది. అంతే కాదు ఈ వార్తలకు వరుణ్ తేజ్ పెళ్లికి ముడిపెడుతూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న లావణ్య వల్లనే ఇదంతా జరిగిందని కొన్ని పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక భార్య గురించి ఇలా మాట్లాడడం, పుకార్లు రావడం ఇష్టం లేదేమో..ఈ వార్తలకు తొందరలోనే పులిస్టాప్ పెట్టించారు.
పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్ తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ సినిమా మట్కా రెగ్యూలర్ షూట్ ను ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. వైర ఎంటర్టైన్మెంట్స్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ తో ఈ సినిమా టీమ్ బిజీగా ఉంది. అంతేకాదు యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రానుంది. అందుకే ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి.
ఇందులో వరుణ్ తేజ్ విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నారని టాక్. అంతే కాదు ఈయన కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా అని కూడా టాక్. ఇక ఇందులో వరుణ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ తన భార్య గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారనుకొని వెంటనే మూవీ మేకర్స్ నుంచి క్లారిటీ ఇప్పించారు. మొత్తం మీద నెగిటివ్ ప్రచారం చేసిన వారికి ఇదొక చెంపపెట్టులా మారింది.