Swetha Varma’s Remuneration: ప్రతి వారం వారం ఏదో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం మీద ఎప్పుడు ఆసక్తి ఉంటుంది ప్రేక్షకుల్లో. అలా ఆరో వారానికి గాను బ్యూటిఫుల్ బోల్డ్ బ్యూటీ శ్వేతా వర్మ ఆరు వారాలకు కి గాను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నది ..? అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న చర్చ.

మంచి నటి నటులు గా ఎదగాలి… మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఉంటుంది. గుర్తింపు తెచ్చుకోవడానికి ఇప్పుడున్న వాటిలో ఒకటి బిగ్ బాస్. చాలామంది సెలెబ్రిటీలకి బిగ్ బాస్ కి వెళ్లడం అనేది ఒక కల. కానీ అందరికీ ఆ అవకాశం రావడం చాలా అరుదు. కొందరికే బిగ్ బాస్ కి వెళ్లే అవకాశం దక్కుతుంది. ప్రేక్షకులని మరింత దగ్గర చేసే ఈ షో కోసం వేరే ప్రాజెక్ట్స్ అన్ని పక్కన పెట్టి మరి బిగ్ బాస్ షో లో పాల్గొంటారు. ఇటు వైపు సెలబ్రిటీస్ ఎంతో ఉత్సాహం తో అయితే బిగ్ బాస్ కి రావాలని అనుకుంటున్నారో బిగ్ బాస్ కూడా వాడల్లా ఆశల్ని అడియాసలు చేయకుండా అంతే విధంగా వాళ్ళకి పారితోషికం ముట్ట చెప్పి వాళ్ళని సంతృప్తి పరుస్తుంటాడు.
అయితే ఈ పారితోషకం అన్నది వస్తున్న సెలబ్రిటీ యొక్క పాపులారిటీ ని బట్టి నిర్ణయించబడి ఉంటది. అలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అయితే తాజా గా బిగ్ బాస్ నుండి ఆరో వారానికి గాను శ్వేతా వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెల్సిందే. అయితే ఈ అమ్మడు ఆరు వారాలకు గాను ఎంత పారితోషికం అందుకున్నది అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
టాస్క్ లో చిరుత పులి లా ఆడుతూ ప్రత్యర్థుల మీద విరుచుకు పడుతూ ముచ్చెమటలు పట్టించింది శ్వేతా వర్మ. ముక్కుసూటిగా మాట్లాడటం, కష్టమో నిష్ఠురమో ఉన్నది ఉన్నట్టు, సూటిగా సుత్తిలేకుండా… నిజాలని నిక్కచ్చిగ్గా కుండబద్దలు పగలకొట్టేట్టు మాట్లాడే శ్వేతా వర్మ ఆరో వారానికే ఎలిమినేట్ అయ్యింది. అని మాస్టర్ ని అమ్మా అని పిలిస్తూ ఒక బంధాన్ని ఏర్పరుచుకుంది శ్వేతావర్మ. ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వడం అందరిని ఒకెత్తు ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే శ్వేతా వర్మ ఒక్కో వారానికి 60 – 70 వేల వరకు పారితోషికం అందుకున్నట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లెక్కన శ్వేతా వర్మ బిగ్ బాస్ నుండి 5 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం.