https://oktelugu.com/

Director Shankar: శంకర్ సినిమాను వదిలేయడం వల్ల పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఒకప్పటి స్టార్ హీరో…

శంకర్ లాంటి ఒక దర్శకుడి నుంచి సినిమా అఫర్ వచ్చింది అంటే దాన్ని ఎవరు వదులుకోరు కానీ ఒక హీరో మాత్రం ఆ సినిమాని వదులుకొని చాలా పెద్ద తప్పు చేశాడానే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : March 12, 2024 / 02:15 PM IST

    Actor Abbas

    Follow us on

    Director Shankar: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శంకర్ దర్శకత్వంలో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పటికి కూడా శంకర్ సినిమా వస్తుంది అంటే అది భారీ బడ్జెట్ తో హై వోల్టేజ్ సినిమాగా తెరకెక్కుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే…ఇక ఇలాంటి క్రమంలోనే శంకర్ లాంటి ఒక దర్శకుడి నుంచి సినిమా అఫర్ వచ్చింది అంటే దాన్ని ఎవరు వదులుకోరు కానీ ఒక హీరో మాత్రం ఆ సినిమాని వదులుకొని చాలా పెద్ద తప్పు చేశాడానే చెప్పాలి.

    శంకర్ డైరెక్షన్ లో ప్రశాంత్, ఐశ్వర్య రాయ్ హీరో హీరోయిన్లు గా వచ్చిన జీన్స్ సినిమాలో అబ్బాస్ ని హీరోగా పెట్టాలని అనుకున్నాడట. అబ్బాస్ అయితే ఆ స్క్రిప్ట్ కి చాలా బాగుంటుందని అనుకున్న శంకర్ అబ్బాస్(Abbas) కి ఈ కథ చెప్పి ఆయనతో చేయడానికి ఒప్పించడట కానీ అంతకుముందు ఆయన కొన్ని సినిమాలు కమిట్ అవ్వడం వల్ల వాటిని వదిలేసి రాలేక జీన్స్ సినిమాని వదిలేసుకున్నాడు. ఇక మొత్తానికైతే జీన్స్ సినిమాలో ప్రశాంత్ ను హీరోగా పెట్టి ఆ సినిమాను తెరకెక్కించాడు.

    ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. దాంతో ప్రశాంత్ హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అబ్బాస్ మాత్రం ఆ సినిమాను వదిలేసుకొని చాలా పెద్ద తప్పు చేశాడు. ఇక దాంతో ఆయనకి అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం ఇప్పటికి కూడా ఆ సినిమాను వదిలేసుకున్నందుకు అబ్బాస్ చాలా బాధపడుతూ ఉంటాడట. ఎందుకంటే ఆయన ఆ ఒక్క సినిమా కనక చేసినట్లయితే ఆయన లైఫ్ అనేది టర్న్ అయిపోయేది. అందుకే సినిమాలు చేసేటప్పుడు అనవసరమైన సినిమాలు వచ్చిన కూడా వదిలేసుకోవడం బెస్ట్ అని, హిట్ అయ్యే ఒక్క సినిమా చేస్తే మేలని ఆయన ఇండస్ట్రీ కి వచ్చే కొత్త నటినటులకి సలహాలను ఇస్తున్నాడు.

    ఒక మొత్తానికైతే తను వదిలేసిన సినిమా వల్ల తను ఎంత నష్టపోయానో కూడా అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ఫీల్ అయ్యాడు… ఇక దానివల్ల ఆయన ఇండస్ట్రీ ని వదిలేసి న్యూజిలాండ్ వెళ్లి కొద్దిరోజులు పెట్రోల్ బంక్ లో పని చేశాడు. ఇక ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు..ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ ను హీరోగా పెట్టి గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…