https://oktelugu.com/

Ravi Teja: రవితేజ ఆ సినిమాకు కేవలం రూ. 10 మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారా?

భారీ హిట్లు, పాన్ ఇండియా హీరోగా ఎదిగినా రవితేజకు సినిమా బ్యాగ్రౌండ్ లేదనే విషయం తెలిసిందే. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన మాస్ రాజా ఇప్పుడు పాన్ ఇండియా హీరో.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 28, 2023 / 04:17 PM IST

    Ravi Teja

    Follow us on

    Ravi Teja: మాస్ రాజా రవితేజ గురించి పరిచయం అవసరం లేదు. చిన్న హీరోగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్న హీరో ఈ స్టార్ హీరో. రీసెంట్ గా టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు రవితేజ. కూల్ గా కోపం లేకుండా మంచితనానికి మారుపేరుగా గుర్తింపు పొందారు రవితేజ. రీసెంట్ గా ఈయన నటించిన సినిమాలు హిట్ లను అందుకున్నాయి.అంతేకాదు ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. టైగర్ నాగేశ్వర రావు భారీ హిట్ ను సొంతం చేసుకోగా ఈగల్ సినిమా పై మరింత హోప్స్ పెరిగాయి.

    భారీ హిట్లు, పాన్ ఇండియా హీరోగా ఎదిగినా రవితేజకు సినిమా బ్యాగ్రౌండ్ లేదనే విషయం తెలిసిందే. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన మాస్ రాజా ఇప్పుడు పాన్ ఇండియా హీరో. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో హీరోలకు స్నేహితుని పాత్రలు కూడా చేశారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సమయంలో చాలా తక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నారట రవితేజ. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సమయంలో భోజనం పెట్టి కేవలం పది రూపాయలు ఇచ్చేవారట.

    హీరో రాజశేఖర్ నటించిన అల్లరి ప్రియుడు సినిమా గురించి, ఆ సినిమా సక్సెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం రోజుకు పది రూపాయలు మాత్రమే తీసుకున్నారట. అంటే పది రూపాయలతో మొదలైన రవితేజ రెమ్యూనరేషన్ ప్రస్తుతం రూ. 30 కోట్ల వరకు చేరింది. అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగి తన సత్తా చాటిన రవితేజను చూస్తూ ఆయన అభిమానులు తెగ మురిసిపోతుంటారు. మొత్తం మీద ఈ హీరో ఈగల్ సినిమాతో రానుండడంతో ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు.