https://oktelugu.com/

Rashmika Mandanna: ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న రష్మిక.. దీనికి కారణం ఏంటి?

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం రష్మికకు బాగా అలవాటు అయిందనే టాక్ ను సంపాదించింది రష్మిక. కన్నడ ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 13, 2023 / 04:54 PM IST
    Follow us on

    Rashmika Mandanna: తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది రష్మిక మందన ఈ అమ్మడు నటించిన చాలా సినిమాలు హిట్ అవడంతో ఈమెకు ఎదురులేకుండా పోయింది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఎన్నో సూపర్ హిట్ లను అందుకుంది. ఇక విజయ్ దేవరకొండ తో జతకట్టి గీతా గోవిందం సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అమ్మడు. ఇదిలా ఉంటే ఈమె అవసరాన్ని బట్టి మారుతుంది అనే టాక్ ను మూటగట్టుకుంటుంది.

    ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం రష్మికకు బాగా అలవాటు అయిందనే టాక్ ను సంపాదించింది రష్మిక. కన్నడ ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఈమెకు క్రేజ్ ఉండడంతో ఇక కన్నడ ఇండస్ట్రీతో అవసరం లేదనుకుందో ఏంటో కానీ కన్నడ ప్రజలకు ఆగ్రహానికి గురైంది. గతంలో కన్నడ ఇండస్ట్రీ పై విమర్శలు చేసి అందరి ఆగ్రహానికి గురైంది. రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా గురించి కూడా కామెంట్ చేసి మరింత నెగటివ్ ను సొంతం చేసుకుంది అమ్మడు.

    రీసెంట్ గా బాలీవుడ్ లో ఎన్నో ఆఫర్లు వస్తుండడంతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తుందని టాక్. యానిమల్, మిషన్ మజ్ను వంటి గుడ్ బై వంటి సినిమాల్లో నటించింది. అంతే కాదు ఇప్పుడు వరుసగా హిందీలో ఆఫర్లు క్యూ కట్టాయట. తెలుగులో కేవలం రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాల్లో మాత్రమే నటించబోతుంది ఈ అమ్మడు. ఇక పుష్ప సినిమాలో నటించి నేషనల్ క్రష్ గా మారిన ఈ బ్యూటీ రెండవ పార్ట్ లో కూడా నటించక తప్పదు. కానీ మిగితా సినిమాల గురించి పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టడం లేదట. కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినా కూడా రిజెక్ట్ చేస్తుందట.

    వారసుడు సినిమాతో రీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్న అమ్మడుకు ఛవా అనే హిస్టారికల్ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించబోతుందని టాక్. మొత్తం మీద తెలుగు సినిమాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట ఈ బ్యూటీ. మరి బాలీవుడ్ లో తన లక్ ను ఎలా పరీక్షించుకుంటుందో చూడాలి.