https://oktelugu.com/

Ranveer Singh: విడాకులకు సిద్ధం అవుతున్న దీపిక పదుకొనె? హింట్ ఇచ్చిన రణ్వీర్ సింగ్… అసలు ఏం జరుగుతోంది?

పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా దీపికా గర్భం దాల్చలేదు. పేరుకే భార్య భర్తలు... వారి మధ్య సాన్నిహిత్యం లేదనే పుకార్లు వినిపించాయి. ఒక దశలో విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. 2024 ఫిబ్రవరి నెలలో దీపికా పదుకొనె తాను గర్భం దాల్చిన విషయం వెల్లడించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 8, 2024 / 08:48 AM IST

    Ranveer Singh

    Follow us on

    Ranveer Singh: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్-దీపికా పదుకొనె విడిపోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. రణ్వీర్ సింగ్ చేసిన పని ఈ ఊహాగానాలకు కారణం అయ్యింది. రణ్వీర్ సింగ్-దీపికల వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రణ్వీర్ సింగ్-దీపిక పదుకొనె 2018లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి కాంబోలో అనే హిట్ చిత్రాలు తెరకెక్కాయి. రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి బ్లాక్ బస్టర్స్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

    పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా దీపికా గర్భం దాల్చలేదు. పేరుకే భార్య భర్తలు… వారి మధ్య సాన్నిహిత్యం లేదనే పుకార్లు వినిపించాయి. ఒక దశలో విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. 2024 ఫిబ్రవరి నెలలో దీపికా పదుకొనె తాను గర్భం దాల్చిన విషయం వెల్లడించారు. సెప్టెంబర్ లో పండంటి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నట్లు ఆమె ప్రకటించారు. దాంతో రణ్వీర్ సింగ్-దీపికా పదుకొనెల విడాకుల వార్తలకు చెక్ పడింది.

    తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రణ్వీర్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడు. 2023కి ముందు పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ మొత్తం తొలగించాడు. ఈ చర్య బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. రణ్వీర్ సింగ్ పెళ్లి ఫోటోలు ఎందుకు తొలగించాల్సి వచ్చింది? దీపికతో ఆయనకు మనస్పర్థలు తలెత్తాయా? విడిపోవాలి అనుకుంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి.

    గతంలో పలువురు సెలెబ్స్ ఇదే తరహాలో హింట్ ఇచ్చారు. సమంత సోషల్ మీడియాలో తన పేరు నుండి అక్కినేని తొలగించింది.నాగ చైతన్యతో జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలు డిలీట్ చేసింది. అలాగే నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడు. సెలెబ్స్ విడాకులకు లేదా బ్రేకప్ కి ముందు ఇలాంటి చర్యలతో హింట్స్ ఇస్తూ ఉంటారు. రణ్వీర్ సింగ్ కూడా విడాకుల ప్రకటన పరోక్షంగా చేశాడనే వాదన తెరపైకి వచ్చింది.

    రణ్వీర్ సింగ్-దీపిక పదుకొనే విడిపోతున్నారన్న వార్తల్లో నిజం లేదు. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ కూడా కావచ్చు. రణ్వీర్ సింగ్ ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించడం వెనుక మరొక కారణం ఉండొచ్చని ఓ వర్గం వాదిస్తుంది. కాగా దీపిక పదుకొనె ఇంస్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు అలానే ఉన్నాయి. ఆమె ఒక్క ఫోటో కూడా తొలగించలేదు. ఈ వ్యవహారం పై క్లారిటీ రావాలంటే స్టార్ కపుల్ స్పందించాలి. లేదంటే కొంత కాలం వెయిట్ చేయాలి.

    రణ్వీర్ తో పెళ్లికి ముందు దీపిక పలు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది. స్టార్ క్రికెటర్స్, హీరోలతో ఆమె డేటింగ్ చేశారనే వాదన ఉంది. ముఖ్యంగా రన్బీర్ కపూర్ తో దీపిక ఎఫైర్ బహిరంగ రహస్యమే. అతన్ని ఘాడంగా ప్రేమించిన దీపిక బ్రేకప్ కారణంగా డిప్రెషన్ కి గురైంది. ఇక దీపిక కెరీర్ విషయానికి వస్తే ప్రభాస్ కి జంటగా కల్కి 2829 AD చేస్తుంది. ఆమె నటిస్తున్న ఫస్ట్ టాలీవుడ్ మూవీ కల్కి కావడం విశేషం.