Ramgopal Varma: సినిమా టికెట్ల తగ్గింపు వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. గత కొద్దిరోజులుగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దలు జగన్ సర్కారుకు ఈ విషయంలో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున లాంటి వాళ్లు ఈ విషయంలో పలుమార్లు సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన పెద్దగా పట్టించుకోకపోవడం ఏపీలో ఉన్న సమస్యలకుతోడు కొత్తగా సినిమా సమస్య వచ్చిపడింది.
తెలంగాణ ఇండస్ట్రీ టాలీవుడ్ పరిశ్రమకు అన్నిరకాలుగా సహాయసహకారాలు అందిస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ కు ఆయువుపట్టు లాంటి నిర్మాతలకు నష్టం కలిగించే చర్యలు చేపడుతోంది. ఒకరిద్దరిపై కక్ష్య సాధించడం కోసం మొత్తం ఇండస్ట్రీని బలిపెడుతుందని ఇండస్ట్రీ భావిస్తోంది. దీంతో ఇన్నిరోజులు ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించిన వారంతా ఇండస్ట్రీ తరుపున తమ వాయిస్ విన్పిస్తున్నారు.
Also Read: దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కు కారణమైన సిరిని శ్రీహాన్ వదిలేశాడా?
పవన్ కల్యాణ్, హీరో నాని, సిద్ధార్థ లాంటివాళ్లు టికెట్ల రేట్ల తగ్గింపుపై ప్రభుత్వంపై బహిరంగానే విమర్శలు గుప్పించారు. చిరంజీవి మాత్రం కర్ర విరగకుండా పాముచావుకుండా అన్నట్లుగా సూతిమెత్తగా ప్రభుత్వ తీరుపై ఎండగడుతున్నారు. ఇటీవల చిరంజీవి తన ట్వీటర్లో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లను ప్రశంసిస్తూనే ఏపీ సర్కారు తీరుపై మెట్టికాయలు వేశారు.
ఇక వివాదాల కేరాఫ్ గా నిలిచే రాంగోపాల్ వర్మ ఇటీవల ఇదే విషయంపై గట్టిగా మాట్లాడుతున్నారు. గత కొద్దిరోజులుగా సినిమా టికెట్ల అంశంపై తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వానికి, మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లకు ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మరోసారి తన ట్వీటర్ వేదికగా మంత్రి పేర్నిని ట్యాగ్ చేస్తూ పలు ప్రశ్నల వర్షం కురిపించారు. తన ప్రశ్నలకు సమాధానం చెబుతారని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం వర్మ ట్వీట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ద్వంద ధరల వ్యవస్థలో పరిష్కారం అనే సిద్దాంతం అనేది చర్చనీయాంశమైందని తెలిపారు. ‘మూవీ టికెట్ల విషయంలో నిర్మాతలు వారి సినిమా టికెట్ల రేట్లను వారి ఇష్టం వచ్చిన ప్రకారం అమ్ముకొంటారని.. మీ ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయండి.. వాటిని తక్కువ ధరకు పేద ప్రజలకు అందించండి.. దాంతో నిర్మాతకు డబ్బు వస్తుంది.. మీకు ఓట్లు రాలుతాయి’ అంటూ వర్మ ఘాటుగా ట్వీట్ చేశారు.
ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక వస్తువుకు ధరను తక్కువకు గానీ.. ఎక్కువగానీ నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉండొచ్చన్నారు. అయితే సినిమా పరిశ్రమ ఎలాంటి వాతావరణం ఉందో మీరు ఎప్పుడైనా గమనించారా? అంటూ ప్రశ్నించారు. పేదలను ఆదుకొనేందుకు రేషన్ షాపులు తెరిచి బియ్యం, చక్కెర లాంటివి తక్కువ ధరకు అందిస్తున్నట్లుగా ప్రభుత్వానికి రేషన్ థియేటర్లు అందించే ఉద్దేశం ఉందా? సార్ అంటూ మరో ప్రశ్నను సంధించారు.
మంత్రి పేర్ని నాని పేద ప్రజలకు సినిమా అత్యవసరమని భావిస్తే? మరీ ఎందుకు సబ్సిడీని ఇవ్వడం లేదన్నారు. వైద్య, విద్య సేవల కోస ప్రభుత్వం తమ ఖజానా నుంచి సబ్సిడీ ఇస్తున్నట్టే సినిమా పరిశ్రమకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. సినిమా గానీ.. ఇతర వస్తువుల ధరను నిర్ణయించే విషయంలో ప్రభుత్వం పాత్ర ఏమిటో చెప్పగలరా? అంటూ వర్మ సూటిగా ప్రశ్నించారు.
సినిమా హీరోల రెమ్యునరేషన్ గురించి ఏపీ మంత్రులు అర్ధం చేసుకోవాలని సూచించారు. వీరికి నిర్మాణ వ్యయం తీసివేయడం తప్పితే మరో విషయం గురించి అవగాహన లేదన్నారు. మీ ప్రభుత్వానికి తామంతా కలిసి అధికారం అప్పగిస్తే మీరు మా గుండెల్లో గూడు కట్టుకొంటారని అనుకున్నామని.. కానీ అందుకు విరుద్ధంగా మీరు మా తలపైకి ఎక్కి కూర్చొనే ప్రయత్నం చేస్తున్నారంటూ వర్శ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మరీ దీనిపై పేర్ని నాని అండ్ కో ఎలా రియాక్ట్ అవుతుందో వేచిచూడాలి.
Also Read: వర్కౌట్ కాదన్నా నితిన్ ఆశ చంపుకోవట్లేదు !