Rambha: హీరోయిన్ రంభ 90లలో స్టార్ హీరోయిన్ సిల్వర్ స్క్రీన్ ని ఏలింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా సినిమాలు చేసింది. తెలుగు అమ్మాయి అయిన రంభ కుర్రాళ్ల కలలరాణిగా ఉన్నారు. అంత పెద్ద హీరోయిన్ రంభ అమ్మమ్మను చూస్తే మీరు నమ్మరు. ఆమె అత్యంత నిరాడంబర జీవితం గడుపుతున్నారు. చిన్న గుడిసెలో జీవిస్తున్నారు. కేవలం రేషన్ బియ్యం తీసుకుని వాటితో జీవితం నెట్టుకొస్తోంది.
రంభ అమ్మమ్మ పేరు కూడా రంభనే. గిరిజన జాతికి చెందిన రంభ అమ్మమ్మకు ప్రతి నెలా 35 కేజీల రేషన్ బియ్యం ఇస్తారట. వాటిలో ఆరు కేజీలు ఉంచుకుని మిగతావి… అమ్మేసుకుంటుందట. ఆ డబ్బులతో కావలసిన సరుకులు కొనుక్కుంటుందట. 80 ఏళ్ళు దాటేయగా మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నాయట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. రంభ అమ్మమ్మను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.
దేశాన్ని ఏలిన రంభ అమ్మమ్మ అంత నిరాడంబర జీవితం గడపడం ఏమిటనే చర్చ మొదలైంది. అయితే ఈ వీడియో ఫేక్ కావచ్చనే వాదన ఉంది. కారణం నటి రంభ స్వస్థలం విజయవాడ. ఆమె అక్కడే పుట్టి పెరిగింది. చదువుకుంది కూడా విజయవాడలోనే. రంభ గిరిజన అమ్మాయి కాదు. రంభ అమ్మమ్మ అంటూ ప్రచారం అవుతున్న బామ్మ వీడియో ఫేక్ కావచ్చు. ఆ బామ్మ పేరు రంభ. అంతే కానీ సినీ నటి రంభతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తుంది.
నిజానిజాలు తెలియాల్సి ఉంది. రంభ 2010లో బిజినెస్ మాన్ ఇంద్రకుమార్ పద్మనాథన్ ని వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. పెళ్లి తర్వాత రంభ సినిమాలు తగ్గించింది. 2007లో విడుదలైన యమదొంగ మూవీలో రంభ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. తెలుగులో రంభ నటించిన చివరి చిత్రం దొంగ సచ్చినోడు. కెనడా దేశంలోని టొరంటో నగరంలో రంభ కుటుంబంతో పాటు సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు ఇండియా వస్తుంది.