Site icon OkTelugu

Allu Arjun : అల్లు అర్జున్ చేసిన పనికి సీరియస్ అవుతున్న చిరంజీవి…

chiranjeevi vs allu arjun

chiranjeevi vs allu arjun

Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్… ఇక ఈ మధ్య ఆయన ఏం చేసిన అది సంచలనంగానే నిలుస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి పని ప్రేక్షకుల్లో ఏదో ఒక విధంగా అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే పాజిటివ్ గా అయిన లేదంటే నెగిటివ్ గా అయిన ఇంపాక్ట్ చూపిస్తుంది.

ఇక మొత్తానికైతే ఆయన పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో ఆయన సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతాడా లేదా అని ఆయన అభిమానులందరూ భావిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ఆయన నంద్యాల వైసిపి అభ్యర్థి అయిన శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడం ఇప్పుడు మెగా అభిమానుల్లో తీవ్రమైన కలవరానికి గురిచేసింది.. ఇక ఇదిలా ఉంటే ఎలక్షన్స్ ముగిసిన వేళ ఆ విషయం మీద చిరంజీవి కూడా కొంతవరకు అల్లు అర్జున్ మీద కోపంతో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే మెగా అభిమానులను ఈ విషయం అల్లు అర్జున్ చాలా వరకు నిరశపెట్టడానే చెప్పాలి. ఇక ఆ రోజు నుంచి అల్లు అర్జున్ చాలా విమర్శలను ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నాడు.ఇక అల్లు అర్జున్ అభిమానులైతే అల్లు అర్జున్ చేసిన దాంట్లో తప్ప ఏమీ లేదు తను నమ్మిన వారికి సపోర్టుగా నిలబడ్డాడు అంటూ కామెంట్లైతే చేస్తున్నారు.

ఇక ఈ విషయం పక్కనపెడితే ఎలక్షన్స్ సీజన్ లో తను ఇంట్లో ఉన్న రాజకీయ నాయకుడికి ఒక ట్వీట్ పెట్టీ బయట ఉన్న నాయకుడి కోసం ప్రచారానికి వెళ్ళడం పట్ల చాలా మంది అల్లు అర్జున్ వైఖరిని తప్పు బడుతున్నారు. ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ చేసింది చాలా తప్పు అని చిరంజీవి కూడా ఆయన మీద కొప్పడ్డట్టు గా కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి..

Exit mobile version