Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తూ నిత్యం వార్తల్లో నిలిస్తు ఉంటారు. దర్శకుల్లో ఆర్జివికి ఉన్న ఫాలోయింగ్ ఏ సపరేట్ అని చెప్పాలి. అలానే సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ట్వీట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటారు రాంగోపాల్ వర్మ. అయితే తాజాగా మంచు లక్ష్మి పోస్టర్ పై ఆసక్తికర ట్వీట్ చేశాడు వర్మ. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న మాన్ స్టార్ అనే సినిమాలో మంచు లక్ష్మి ఓ పాత్ర లో కనిపించనుంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ను మంచు లక్ష్మి తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది మంచు లక్ష్మి.
Ram Gopal Varma
Also Read: “డిటెక్టివ్ సత్యభామ” గా రానున్న సోనియా అగర్వాల్…
అయితే ఈ ఫోటో పై రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. మంచు లక్ష్మి ఫోటోను ట్యాగ్ చేస్తూ… “ఈమె ఎవరో గెస్ చేయండి” అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ఆ ట్వీట్ చేసిన కొద్ది క్షణాల్లోనే మరో ట్వీట్ చేసి… మంచు లక్ష్మీ పై పొగడ్తల వర్షం కురిపించాడు వర్మ. “నువ్వు చేయలేని పని ఏదైనా అసలు ఉందా ? నా కళ్ళను నేనే నమ్మలేక పోతున్నాను” అంటూ రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై మంచు లక్ష్మి కూడా పాజిటివ్ గానే స్పందించింది. “ఒక ఆర్టిస్ట్ గా నేను చేయలేనిది ఏదీ లేదు అందుకే ఈ క్యారెక్టర్ చేస్తున్నాను” అంటూ బదులిచ్చింది మంచు లక్ష్మి. కాగా ఆర్జీవి కొండా అనే మరో సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మరోవైపు అమ్మాయి, డేంజరస్, తులసి తీర్ధం సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.
I will not give 1 lakh to anyone who can’t tell who this is not 💪💪💪 pic.twitter.com/AM3Ft5RRCe
— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2021
Also Read: ఈ తరానికి మరో ఎస్వీయార్ ఆయన !