Rakasa movie first week collections: సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత మన టాలీవుడ్ కి గడ్డు కాలం ఎదురైంది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాలుగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో విడుదలైన హే బలవంత్ , విష్ణు విన్యాసాలు , కపుల్ ఫ్రెండ్లీ వంటి చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిలిచాయి. ఇక మార్చి నెల లో విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఘోరమైన నెగెటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టే వసూళ్లు కూడా వచ్చాయి. కనీసం ఏప్రిల్ నెలలో విడుదలయ్యే చిన్న సినిమాలు అయినా సూపర్ హిట్ అవుతాయని అనుకుంటే , అవి కూడా మిశ్రమ ఫలితాలనే సొంతం చేసుకుంటున్నాయి. ఏప్రిల్ 2 న విడుదలైన ‘రాకాస'(Rakasa Movie) చిత్రం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి చాలా కష్టపడుతోంది.
విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఆడియన్స్ లో మంచి అంచనాలను ఏర్పాటు చేసుకుంది ఈ చిత్రం. కానీ విడుదల తర్వాత కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ , బాక్స్ ఆఫీస్ వద్ద నెగ్గుకురాగలదని అనుకున్నారు. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కేవలం 13 కోట్ల రూపాయిలు మాత్రమే కాబట్టి. అయితే వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది?, బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత దూరం లో ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం , ఈ చిత్రానికి 7 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.
ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి వారం లో 9 కోట్ల 60 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చాయట. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టాల్సి ఉంటుంది. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే, నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి 2 కోట్ల 60 లక్షలు , సీడెడ్ ప్రాంతం నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 2 కోట్ల రూపాయిల రేంజ్ షేర్ వసూళ్లు వచ్చాయి. అన్ని ప్రాంతాలతో పోలిస్తే, నైజాం ప్రాంతం లోనే ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి.