Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కి ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. ఇండస్ట్రీలో జరిగే ప్రతి కొత్త మార్పు వెనక తన హస్తముండేది. ఆయన కొత్త టెక్నాలజీలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక అలాగే నిర్మాతల హీరోగా కూడా కృష్ణ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తనతో సినిమా చేసిన ప్రొడ్యూసర్స్ నష్టపోతే ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు లేకపోయిన కూడా కృష్ణ వాళ్లకి రిటర్న్ లో డబ్బులు ఇచ్చి మరొక సినిమా ఛాన్స్ కూడా ఇచ్చేవాడని కృష్ణ గురించి చాలామంది సీనియర్ నటులు చాలా గొప్పగా చెబుతుంటారు. ఇక అలాంటి కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలను చేస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా ఎదగడమే కాకుండా సూపర్ స్టార్ అనే ఒక బ్రాండ్ నేమ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు తను చేసిన ప్రతి సినిమాలో కూడా డిఫరెంట్ కథాంశాలని ఎంచుకుంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు సక్సెస్ కి చిరునామాగా మారిన రాజమౌళి డైరెక్షన్ లో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే మహేష్ బాబు ఈ సినిమా చేయడం పట్ల పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక తెలుగు వాళ్ళమైన మనందరం గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఒక భారీ ప్రాజెక్టుతో తెలుగు హీరో తెలుగు డైరెక్టర్ కలిసి పాన్ వరల్డ్ లోకి మన సినిమా స్థాయిని తీసుకెళ్తున్నారు అంటే ఇది ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయమనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి అయితే నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది.
ఎప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తారు అనే టాపిక్ మీదనే ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి రాజమౌళి సినిమా అంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా ప్రతి హీరో కూడా ఆయన కోసం దాదాపు ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఆయన సినిమా మీద తన డేట్స్ ని కేటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే సినిమా కోసం ఆయన పెట్టే ఎఫర్ట్స్ అలాంటివి.. ప్రతి షాట్ ని ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతుంటాడు.
ఇక ఇలాంటి సందర్భంలోనే ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎక్కువ డేట్స్ ని తీసుకొని తద్వారా వాళ్లకి ఏ ఇతర సినిమాలతో సంబంధం లేకుండా తన దగ్గరే ఉంచుకొని పర్ఫెక్ట్ ప్రోడక్ట్ రెడీ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు వస్తున్న సినిమాకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని, మరొక బ్యాడ్ న్యూస్ ని కూడా మహేష్ బాబు అభిమానులకు రాజమౌళి తెలియజేయబోతున్నాడు… అదేంటి అంటే రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాని అక్టోబర్ నుంచి సెట్స్ మీదికి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారట.
ఇక ఇది గుడ్ న్యూస్ కాగా, మరొక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే దాదాపు నాలుగు సంవత్సరాల వరకు మహేష్ బాబు ఎక్కడా కూడా స్క్రీన్ మీద కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ న్యూస్ తెలిసిన తర్వాత మహేష్ బాబు అభిమానులకు ఒకవంతుకు హ్యాపీ గా అనిపించినప్పటికీ తమ అభిమాన హీరో నాలుగు సంవత్సరాల వరకు కనబడాడు అనే ఒక చిన్నపాటి బాధ అయితే వాళ్లకు ఉంది…చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది…