Rajamouli: మహేష్ బాబు-రాజమౌళి మూవీ కోసం అభిమానులతో పాటు మూవీ లవర్స్ వెయిటింగ్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ మొదలైనట్లు సమాచారం. రాజమౌళి స్క్రిప్ట్ కూడా లాక్ చేశాడట. మహేష్ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చారు. మహేష్ ఇమేజ్ కి సెట్ అయ్యేలా యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఎంచుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మహేష్ రోల్, గెటప్ హాలీవుడ్ హీరోలను తలపించేలా డిజైన్ చేస్తున్నారు. బడ్జెట్ కూడా విపరీతంగా పెంచేశారట. రూ. 800 నుండి 1000 కోట్ల వరకు కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.
అలాగే మహేష్ మేకోవర్ కానున్నాడు. మహేష్ లుక్ టెస్ట్ కే నెల రోజులు కేటాయించారట. కొన్ని స్కెచెస్ సిద్ధం చేసిన రాజమౌళి దీనిపై కసరత్తు చేస్తున్నారట. మహేష్ సిక్స్ ప్యాక్ లో కనిపించడం ఖాయం అంటున్నారు. అలాగే ఆయన కొన్ని యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకోనున్నారట. రాజమౌళి మూవీ కోసం మహేష్ చాలా కష్టపడాల్సి ఉందని సమాచారం. సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది.
కాగా మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ అధికారికమే అయినప్పటికీ యూనిట్ ప్రెస్ ముందుకు వచ్చింది లేదు. అనధికారికంగా వివిధ సందర్భాల్లో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఈ క్రమంలో రెండు వారాల్లో రాజమౌళి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారట. రాజమౌళి, మహేష్ బాబుతో పాటు నిర్మాత హాజరు కానున్నారట. ప్రాజెక్ట్ కి సంబంధించిన పలు విషయాలు మీడియా ముఖంగా తెలియజేయనున్నారట. ఈ న్యూస్ మహేష్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది.
ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి ముఖ్యంగా షూటింగ్ ఎప్పుడు మొదలు కానుంది? విడుదల తేదీ ఎప్పుడు ఉండొచ్చు? సాంకేతిక నిపుణులు, నటులకు సంబంధించిన సమాచారం పంచుకునే అవకాశం కలదు. దీంతో ఈ ప్రెస్ మీట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుస్తున్నారు. హాలీవుడ్ సక్సెస్ ఫుల్ సిరీస్ ఇండియానా జోన్స్ ని తలపించేలా మహేష్ మూవీ ఉంటుందట. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ కనిపిస్తారట. హాలీవుడ్ హీరోయిన్ మహేష్ తో జతకట్టనుందట.