Varanasi Movie Release Date: #RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కిస్తున్న ‘వారణాసి'(Varanasi Movie) పై రోజురోజుకి ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని రేంజ్ లో చూపించే ప్రయత్నం చేసున్నాడు రాజమౌళి. ఇప్పటికే గ్లింప్స్ వీడియో లో మహేష్ బాబు లుక్ ని మీరంతా చూసే ఉంటారు. ఇందులో మహేష్ బాబు శ్రీ రాముడిగా కూడా కనిపించబోతున్నాడు. ఆ లుక్ ని ఏ రేంజ్ లో డిజైన్ చేసి ఉంటాడో మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఈ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ #Globetrotter ఈవెంట్ కి ముందే జరిగిందట, ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ఆ ఈవెంట్ లోనే చెప్పుకొచ్చాడు. ఆయన మొబైల్ వాల్ పేపర్ కూడా మహేష్ శ్రీ రాముడి లుక్ లో ఉన్న ఫోటో ని పెట్టుకున్నాడట.
ఇదంతా పక్కన పెడితే ‘వారణాసి’ చిత్రం రాజమౌళి సినీ కెరీర్ లోనే అత్యంత వేగవంతంగా పూర్తి చేయబడే సినిమాగా నిలబడబోతుంది. ఈ ఏడాది అక్టోబర్ లోపు ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుంది. మహేష్ బాబు పార్ట్ కి సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ కే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. VFX వర్క్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నారట. అన్నీ ప్లాన్ ప్రకారం పోతే ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేస్తారట. ఈ తేదీని మేకర్స్ అధికారికంగా ఖరారు చేసినట్టు సమాచారం. అయితే రాజమౌళి ఈ సినిమా విడుదల తేదీని చాలా విన్నూతన రీతిలో , పబ్లిసిటీ లేకుండా ‘వారణాసి’ ప్రాంతం లో రెండు బ్యానర్స్ ని ఏర్పాటు చేసాడు. ఒక బ్యానర్ పై ‘ In Theatres’ అని ఉండగా, మరో బ్యానర్ పై ‘7 April 2027’ అని ఉంది.
ఇంత తెలివిగా ఒక సినిమా విడుదల తేదీని ప్రకటించాలనే ఆలోచన ఈ ప్రపంచం లో రాజమౌళి కి టాప్, మరో ఫిల్మ్ మేకర్ కి అనిపించదు అంటూ సోషల్ మీడియా లో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మార్చి 5 న ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా పై కూడా ‘వారణాసి’ తో సమానమైన క్రేజ్ ఉంది. టాక్ వస్తే నెల రోజుల పాటు వసూళ్ల సునామీనే. మరి ఆడియన్స్ ఒక చిత్రాన్ని ఆ రేంజ్ లో ఎగబడి చూసిన తర్వాత, ‘వారణాసి’ ని కూడా అదే స్థాయిలో చూస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక నెల గ్యాప్ లో రెండు ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ సినిమాలు విడుదల అవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి.
#BreakingNews… SS RAJAMOULI’S MUCH-AWAITED BIGGIE ‘VARANASI’ TO RELEASE ON 7 APRIL 2027?… There’s tremendous speculation that master storyteller #SSRajamouli‘s much-awaited biggie #Varanasi is gearing up for a worldwide release on [Wednesday] 7 April 2027.
Hoardings have… pic.twitter.com/ZW232tPXIH
— taran adarsh (@taran_adarsh) January 29, 2026