Radhika Apte Sensational comments: సినీ ఇండస్ట్రీ లో చాలా బోల్డ్ గా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే హీరోయిన్స్ లో ఒకరు రాధికా ఆప్టే(Radhika Apte). ఈమె మన టాలీవుడ్ లోకి ‘రక్త చరిత్ర’ అనే చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించి, నటించిన ‘ధోని’ చిత్రం లో కూడా ఈమె కీలక పాత్ర పోషించింది. అదే విధంగా నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘లెజెండ్’, ‘లయన్’ చిత్రాల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. వరుసగా హిందీ లో సినిమాలు చేస్తూ వచ్చింది. మధ్యలో కొన్ని తమిళ సినిమాల్లో కూడా చేసింది. ఇదంతా పక్కన పెడితే ఈమె హాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించింది అనే విషయం మీకు తెలుసా.
2019 వ సంవత్సరం లో ‘ది వెడ్డింగ్ గెస్ట్’, ‘ది ఆశ్రమ్’, ‘ఏ కాల్ టు స్పై’ వంటి చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది కూడా ఆమె ‘లాస్ట్ డేస్’ అనే ఇంగ్లీష్ చిత్రం లో నటించింది. వీటితో పాటు వెబ్ సిరీస్ లు, టెలివిజన్ షోస్ లో కూడా ఈమె రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. రీసెంట్ గానే ఈమె నెట్ ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కించినా ‘అక్కా’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. కీర్తి సురేష్ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. వచ్చే ఏడాది ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాసేపు పక్కన పెడితే ఈమె మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పై సందర్భం దొరికినప్పుడల్లా ఎదో ఒకటి కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఒక సౌత్ సినిమా చేస్తున్నప్పుడు తన అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘ఒక సౌత్ సినిమా షూటింగ్ సెట్స్ లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన వ్యక్తి నా వద్దకు వచ్చి పిరుదులు, బ్రెస్ట్ పెంచేందుకు ప్యాడింగ్ చేయమని చెప్పారు. వాళ్ళ కోసం ప్యాడ్స్ వేసుకొని వచ్చినా కూడా, అది సరిపోదమ్మా, ఇంకా కొంచెం ప్యాడింగ్ చేయమని అడిగేవారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపించడమే కాకుండా, మానసిక ఒత్తిడికి కూడా గురి చేసింది’ అంటూ చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. ఇంతకీ ఆమెని అలా ప్యాడింగ్ చేసుకోమని అడిగిన ఆ సౌత్ దర్శకుడు ఎవరు?, తెలుగు తో పాటు, తమిళం లో కూడా ఈమె సినిమాలు చేసింది. ఎవరు అయ్యుంటారు? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ విశ్లేషిస్తున్నారు.