Pushpa 2: ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఒకే ఒక సినిమా ఫీవర్ ఎక్కువగా నడుస్తుంది. అది ఏ సినిమా అంటే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2… ఈ సినిమా కోసం జనాలు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఎంతలా అంటే ఈ సినిమా రేపు రిలీజ్ అయినా కూడా ఈరోజు నైటే జనాలు టికెట్లను సంపాదించుకునేంత రేంజ్ లో ఈ సినిమా క్రేజ్ ను అయితే మూటగట్టుకుంది అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే చాలా సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. ఇక ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా రికార్డుని ఈ సినిమా బ్రేక్ చేసింది. అది ఎలానో ఒక్కసారి మనం తెలుసుకుందాం..ఇక దానికంటే ముందు పుష్ప 2 సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ ను 200 కోట్ల రూపాయలకు అమ్మినట్టుగా సమాచారం అందుతుంది.
ఇక దాంతో పాటుగా ఆడియో రైట్స్ కింద 65 కోట్లు వచ్చాయి. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ పుష్ప 2 కోసం 275 కోట్ల రూపాయలని వెచ్చించి మరి ఈ సినిమాని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా బడ్జెట్ 450 కోట్ల వరకు అయింది. ప్రమోషన్స్ తో కలిపి 500 కోట్ల వరకు అయినట్టు గా తెలుస్తుంది. ఇక సినిమా రిలీజ్ కి ముందే 500 కోట్లకు పైన ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు త్రిబుల్ ఆర్ సినిమా 450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. కాబట్టి పుష్ప 2 500 కోట్ల బిజినెస్ తో ‘త్రిబుల్ ఆర్’ రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఇక ఇది ఇలా ఉంటే ప్రొడ్యూసర్స్ పెట్టిన బడ్జెట్ మొత్తం రిలీజ్ కి ముందే వచ్చింది. కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కి ఈ సినిమా మీద వచ్చేదంతా లాభాలే…
మరి ఈ సినిమాని సుకుమార్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక రిలీజ్ కి ముందే ఈ సినిమా ఇన్ని రికార్డులను బ్రేక్ చేస్తే రిలీజ్ తర్వాత ఏ ఒక్క రికార్డ్ కూడా మిగిలేలా లేదు అని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…