https://oktelugu.com/

Double ISmart: పాన్ ఇండియా లో ‘డబుల్ ఇస్మార్ట్’ సక్సెస్ సాధించాలంటే పూరి జగన్నాథ్ ఈ ఒక్కటి చేయాల్సిందే…

తెలుగు సినిమా స్థాయి ని పెంచిన దర్శకులు చాలా మంది ఉన్నారు. అయితే కమర్షియల్ సినిమాలు తీసి సక్సెస్ లు కొట్టడం లో మాత్రం పూరి జగన్నాథ్ ను మించిన డైరెక్టర్ మరొకరు లేరనేది వాస్తవం...

Written By:
  • Gopi
  • , Updated On : July 25, 2024 / 12:18 PM IST

    Double ISmart:

    Follow us on

    Double ISmart: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. 2000 వ సంవత్సరంలో బద్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన మేకింగ్ ఎలా ఉంటుందో జనానికి చూపించాడు. అని దాంతో పాటుగా వరుసగా మంచి విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్ళడమే కాకుండా ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతలా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ని అందుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. లైగర్ సినిమాతో వచ్చి భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న ఆయన ఆ సినిమా డిజాస్టర్ నుంచి బయట పడాలంటే ఇప్పుడు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇలాంటి సమయంలోనే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మీద పాన్ ఇండియాలో భారీగా ప్రమోషన్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక దీనికి పోటీగా బాలీవుడ్ లో స్ట్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేద అనే మూడు సినిమాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఇక దాంతో పాటుగా తెలుగులో అయితే ‘మిస్టర్ బచ్చన్’ లాంటి ఒక భారీ సినిమా కూడా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాకి పోటీగా వస్తున్నాయి.

    Also Read: 13 డిజాస్టర్ల తర్వాత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో…

    మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. అలాగే రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక పూరి జగన్నాధ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని చాలా వేగవంతం చేయాల్సిన అవసరం అయితే ఉంది.

    ఇక ఇప్పటివరకు ఈ సినిమా మీద తెలుగులో మంచి అంచనాలు ఉన్నప్పటికీ బాలీవుడ్ లో మాత్రం అంచనాలు పూర్తిగా లేకుండా పోయాయి. దాని కారణం పూరి జగన్నాథ్ గత చిత్రం లైగర్ ఫ్లాప్ వల్ల ఆయన నేమ్ అక్కడ భారీగా డ్యామేజ్ అయింది. మరి ఇప్పటికైనా ఈ సినిమాతో తన పేరును తాను నిలబెట్టుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగష్టు 15వ తేదీన భారీ సక్సెస్ ని సాధిస్తుందని గట్టి నమ్మకంతో అయితే ఉన్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే…

    పూరి జగన్నాథ్ గతంలో మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం తను చాలావరకు డీలా పడిపోయాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు. దీంతోపాటుగా ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొడితే ఆయనకు స్టార్ హీరోల నుంచి కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి. మరి దానికి అనుకూలంగానే పూరి జగన్నాథ్ ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

    Also Read: గజిని తర్వాత నుంచి కంగువ వరకు సూర్య చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటో తెలుసా..?