Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్..ఈయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ఈయన స్టార్ డైరెక్టర్ గా ఎదగడంలో చాలావరకు హెల్ప్ అయ్యాయి. ఇక ఇప్పుడు ‘పూరి మ్యూజింగ్స్’ అనే పేరుతో యూ ట్యూబ్ లో ఒక ఛానల్ పెట్టి దాని ద్వారా తన అభిమానులకి కొన్ని మోటివేషన్ ఇచ్చే మాటలను మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్ గా ‘ఇన్సాల్ట్ ‘(అవమానం) గురించి కొన్ని మాటలు మాట్లాడారు.
మన లైఫ్ లో మనల్ని ఎవరైనా అవమానించినప్పుడు మనం చాలా బాధపడతాం. దాని గురించి ఆలోచిస్తూ మూడంత డిస్టర్బ్ చేసుకుంటాం. కానీ అలా కాకుండా మనల్ని ఎవరైనా అవమానించినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వండి. అప్పుడే చాలా హుందాగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాంటప్పుడు మూడు విషయాలను గుర్తు పెట్టుకోండి…
నెంబర్ 1 ఏ సందర్భంలో వాళ్ళు మిమ్మల్ని ఆమానించారో అర్థం చేసుకోండి, ఆ వ్యక్తి నీ మంచి కోరేవాడా, నిన్ను అమితంగా ఇష్టపడేవాడా, నీ ఫ్రెండా, నీ శత్రువా, నీ బాసా, ఇంట్లో మీ నాన్న నా కొన్నిసార్లు ఇంట్లో నాన్న కూడా నీకు తిండి పెట్టడం దండగ అని తిడుతూ ఉంటాడు..
నెంబర్ 2 ఏ ఉద్దేశ్యం తో అవమానించారు? ఏదైనా చిన్న విషయానికి అవమానించారా? లేదా వ్యక్తిగతంగా చులకనగా చూశారా? లేదా నీ జాతి గురించి తప్పుగా మాట్లాడారా?
నెంబర్ 3 మిమ్మల్ని ఎక్కడ అవమానించారు? మీరిద్దరే ఉన్నప్పుడా? పబ్లిక్ గానా లేదా సోషల్ మీడియా వేదికగానా ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని స్పందించాల్సి ఉంటుంది…
ఇక మీకు అవమానం జరిగిన ప్రతిసారి మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి.ఎందుకంటే అవతల వ్యక్తి మిమ్మల్ని కావాలని రెచ్చగొడుతూ మీతో గొడవకు దిగాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి వాటిని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి..వాడు ఎంత నిందించిన కూడా ఒక చిన్న చిరునవ్వుతో వాడికి సమాధానం చెప్పండి. ఇక వాడితో ఇంకా ఏదైనా చెప్పాలి అనిపిస్తే అవమానించినందుకు థాంక్యూ అని చెప్పండి. నువ్వు అవమానించిన ప్రతిసారి నేను నా జీవితంలో ఎదుగుతూ వస్తున్నానని చెప్పండి. మిమ్మల్ని దూషించినవాడిని మీరు నిందించకుండా వదిలేయండి “బెస్ట్ రెస్పాన్స్ ఇస్ నో రెస్పాన్స్”…
అయితే కొన్ని అవమానాల వల్ల మనం మన జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎవరైనా అవమానించిన ప్రతిసారి మనం వాళ్ళకంటే ఉన్నతంగా బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.. ఇక ఈ క్రమంలో మనల్ని మనం చాలా వరకు మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం…మనల్ని కించపరిచేలా మాట్లాడిన ప్రతిసారి వాదనకు దిగకూడదు ‘అవమానం’ అనేది చాలా విలువైనది దాన్ని చాలా భద్రంగా దాచుకోవాలి. అందుకే ప్రతి అవమానాన్ని సక్సెస్ కోసం వాడుకోవాలి అంటూ వివరించారు…