Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Pratinidhi 2 Twitter Review: ప్రతినిధి 2 ట్విట్టర్ టాక్: నారా రోహిత్ పొలిటికల్ థ్రిల్లర్...

Pratinidhi 2 Twitter Review: ప్రతినిధి 2 ట్విట్టర్ టాక్: నారా రోహిత్ పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

Pratinidhi 2 Twitter Review: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ హీరో నారా లోకేష్ ప్రతినిధి 2 అంటూ ప్రేక్షకులను పలకరించాడు. దర్శకుడు టీవీ5 మూర్తి తెరకెక్కించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ మే 10న విడుదలైంది. ఇప్పటికే ప్రతినిధి చిత్రం ప్రీమియర్స్ ముగిశాయి. సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

ప్రతినిధి 2 మూవీ కథ విషయానికి వస్తే… చైతన్య(నారా రోహిత్) నిజాయితీపరుడైన జర్నలిస్ట్. ఫ్రీలాన్స్ గా పని చేస్తూ ఉంటాడు. ఓ ప్రముఖ మీడియా సంస్థ చైతన్యను సీఈవోగా నియమించుకుంటుంది. ఆ సంస్థల్లోకి వచ్చిన చైతన్య అక్రమాలు చేస్తున్న రాజకీయనాయకుల గుట్టు బయట పెడుతూ ఉంటాడు. వాళ్ళ అన్యాయాలను ప్రశ్నిస్తాడు.

అనూహ్యంగా ఒకరోజు ముఖ్యమంత్రి ప్రజాపతి(సచిన్ ఖేడేకర్) మీద హత్యాయత్నం జరుగుతుంది. దాంతో సీబీఐ రంగంలోకి దిగుతుంది. నారా రోహిత్ సైతం ఈ ఘటన వెనకున్నది ఎవరు? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అసలు చైతన్య ఎవరు? అతడు జర్నలిస్ట్ ఎందుకు కావాలని అనుకున్నాడు? సీఎం మీద మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరు? అనేది మిగతా కథ..

ఇక ప్రతినిధి 2 చూసిన ఆడియన్స్ రెస్పాన్స్ పరిశీలిస్తే మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ప్రతినిధి 2లో మంచి మెసేజ్ ఉంది. ఓటు ఎంత విలువైనది, నాయకుడిని ఎంచుకునే క్రమంలో ఎంత బాధ్యత ఉండాలి వంటి విషయాలు చెప్పారు. అలాగే నిజాయితీతో కూడిన జర్నలిజం సమాజానికి ఎంత మేలు చేస్తుందో చెప్పారు. జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ మెప్పించాడు.

అదే సమయంలో ప్రతినిధి 2 రొటీన్ పొలిటికల్ డ్రామా. దర్శకుడు మూర్తి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నాడు. ముఖ్యమంత్రి మీద అటాక్, సీబీఐ ఎంక్వరి సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. సెకండ్ హాఫ్ ముఖ్యంగా కమర్షియల్ ఫార్మాట్ లో తీశారు. కథ కథనాల్లో పెద్దగా దమ్ము లేదని ప్రేక్షకుల అభిప్రాయం. సందేశం కోసం ఒకసారి చూడొచ్చు అంటున్నారు…

RELATED ARTICLES

Most Popular