https://oktelugu.com/

Prabhas’ new target: ప్రభాస్ కొత్త టార్గెట్..రెండు సంవత్సరాలలో అన్ని సినిమాలు చేయాలా..?

ఇప్పటికే ప్రభాస్ లాంటి స్టార్ హీరో గత సంవత్సరంలో ఆది పురుషు, సలార్ అనే రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. ఇప్పుడున్న రోజుల్లో ఒక సంవత్సరం లో ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 7, 2024 / 12:00 PM IST

    Prabhas-new-target

    Follow us on

    Prabhas’ new target: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ల దూకుడును పెంచుతున్నారు. గతం లో ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా చేస్తూ ముందుకు సాగేవారు. కానీ ఇప్పుడు ఒక సినిమా సెట్స్ మీద వుండగానే మరొక సినిమాకి కమిట్ అవుతున్నారు. ఒకటి కంటే ఎక్కువ సినిమాలను చేతిలో పెట్టుకొని డైరెక్టర్స్ ను లాక్ చేసి పెడుతున్నారు.

    దాంతో పాటుగా చాలా తొందరగా సినిమా షూటింగ్ లను కూడా పూర్తి చేస్తూ వీలైనంత తొందరగా సినిమాలని రిలీజ్ చేసే ప్రయత్నంలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ప్రభాస్ లాంటి స్టార్ హీరో గత సంవత్సరంలో ఆది పురుషు, సలార్ అనే రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. ఇప్పుడున్న రోజుల్లో ఒక సంవత్సరం లో ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా ఉంది. అలాంటిది ప్రభాస్ ఏకంగా ఒక సంవత్సరం లో రెండు సినిమాలను రిలీజ్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఇక అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా రెండు సినిమాలను రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్(Raja Saab), నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న కల్కి(Kalki) ఈ రెండు సినిమాలకి డేట్స్ ని అడ్జస్ట్ చేస్తూ ఈ సినిమాలా షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో వచ్చే స్పిరిట్, అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చే సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఈ లెక్కన సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకొని ముందుకు కదులుతున్నాడు. కాబట్టి ప్రభాస్ ఇక తీరిక లేకుండా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్లే రాబోయే రెండు సంవత్సరాల్లో నాలుగు సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు.

    అంటే ఆరు నెలలకు ఒక సినిమాను టార్గెట్ గా పెట్టుకొని ముందు సాగుతున్నాడు. దీనివల్ల ప్రభాస్ కి ఎక్కువ సినిమాలు చేసే అవకాశం రావడమే కాకుండా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మందికి కూడా పని దొరుకుతుంది. అలాగే ప్రభాస్ అభిమానులు కూడా సంవత్సరానికి రెండు సార్లు ప్రభాస్ ను స్క్రీన్ మీద చూసే అవకాశం వస్తుందని అనందపడుతున్నారు…