https://oktelugu.com/

Bunny Heroine: అవి ఉన్నాయా అని అడిగిన నెటిజన్… అర్థ నగ్న ఫోటో షేర్ చేసి, చూసుకోమన్న బన్నీ హీరోయిన్!

పూనమ్ కి బ్రేక్ రాకపోవడంతో సపోర్టింగ్ రోల్స్ కి పడిపోయింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పరుగు చిత్రం తెరకెక్కింది. అల్లు అర్జున్ హీరోగా షీలా హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలో ప్రియుడితో పారిపోయిన అక్క పాత్ర చేసింది పూనమ్ బజ్వా.

Written By:
  • S Reddy
  • , Updated On : February 17, 2024 / 01:52 PM IST
    Follow us on

    Bunny Heroine: నెటిజెన్స్ కొంటె ప్రశ్నలు అడగడం కామన్. అయితే హీరోయిన్స్ వాటిని పట్టించుకోరు. బన్నీ హీరోయిన్ మాత్రం ఏకంగా ఫ్రూఫ్స్ తో సహా సమాధానం చెప్పింది. పూనమ్ బజ్వా ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్. ‘మొదటి సినిమా’ అనే చిత్రంతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నవదీప్ హీరోగా నటించాడు. రెండో చిత్రం కూడా నవదీప్ తోనే చేసింది. మూడో చిత్రంలో కింగ్ నాగార్జున పక్కన ఛాన్స్ పట్టేసింది. బాస్ మూవీలో నయనతార హీరోయిన్ కాగా, పూనమ్ బజ్వా సెకండ్ హీరోయిన్ గా చేసింది.

    బాస్ అంతగా ఆడలేదు. పూనమ్ కి బ్రేక్ రాకపోవడంతో సపోర్టింగ్ రోల్స్ కి పడిపోయింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పరుగు చిత్రం తెరకెక్కింది. అల్లు అర్జున్ హీరోగా షీలా హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలో ప్రియుడితో పారిపోయిన అక్క పాత్ర చేసింది పూనమ్ బజ్వా. పరుగు మూవీలో ఆమె పాత్రకు పెద్దగా నిడివి కూడా ఉండదు. పరుగు అనంతరం పూనమ్ బజ్వా టాలీవుడ్ కి దూరమైంది. కనీసం కోలీవుడ్ లో సక్సెస్ అయ్యే ప్రయత్నం చేసింది.

    తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. పూనమ్ బజ్వా తెలుగులో నటించిన చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఎన్టీఆర్ కూతుళ్లతో ఒకరైన గారపాటి లోకేశ్వరి పాత్ర చేసింది. అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్న పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది. బోల్డ్ ఫోటో షూట్స్ తో నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. పూనమ్ బజ్వా తరచుగా హాట్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంటారు.

    తాజాగా ఆమె ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ కొంటె ప్రశ్న అడిగాడు. మీ ఒంటిపై స్ట్రెచ్డ్ మార్క్స్ ఉన్నాయా? అని అడిగాడు. సదరు నెటిజెన్ కి సమాధానంగా… అర్థ నగ్న ఫోటో షేర్ చేసిన పూనమ్… స్ట్రెచ్డ్ మార్క్స్ లేవు. కానీ కొంచెం ఫ్యాట్ ఉందని సమాధానం చెప్పింది. సాధారణంగా ఎలాంటి ప్రశ్నలు హీరోయిన్స్ అవైడ్ చేస్తారు. పూనమ్ మాత్రం తన శరీరం చూపించి మరీ, స్పష్టంగా తెలియజేసింది. పూనమ్ డేర్ కి జనాలు అవాక్కు అవుతున్నారు.