https://oktelugu.com/

Poonam Bajwa: బన్నీ హీరోయిన్ బికినీ ట్రీట్… పూజ బజ్వా రచ్చ రేపిందిగా, ఫోటోలు వైరల్

బొమ్మరిల్లు భాస్కర్ అల్లు అర్జున్ హీరోగా పరుగు మూవీ చేశారు. ఈ మూవీలో హీరోయిన్ అక్క పాత్రలో తళుక్కున మెరిసింది. ఈ మూవీలో పూనమ్ బజ్వా హీరోయిన్ కాదు. అందుకే పరుగు హిట్ టాక్ తెచ్చుకున్నా పూనమ్ బజ్వా కెరీర్ కి ప్లస్ కాలేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 3, 2024 / 12:15 PM IST
    Follow us on

    Poonam Bajwa: పూనమ్ బజ్వా తెలుగు తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అయితే ఆమె సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ళ గుండెల్లో కాక రేపుతోంది. పూనమ్ బజ్వా తెగింపుకు జనాలు అవాక్కు అవుతున్నారు. పూనమ్ బజ్వాకు కాలం కలిసి రాలేదు. ఆమెకు హీరోయిన్ గా బ్రేక్ రాలేదు. పూనమ్ బజ్వా 2005లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. మొదటి సినిమా టైటిల్ తో ఆమె డెబ్యూ మూవీ విడుదలైంది. ఈ మూవీలో నవదీప్ హీరో. ఈ చిన్న సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

    నవదీప్ తో మరోసారి జతకట్టింది. ప్రేమంటే ఇంతే టైటిల్ తో విడుదలైన ఈ మూవీ కూడా నిరాశపరిచింది. అనూహ్యంగా కింగ్ నాగార్జున పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఆయన హీరోగా తెరకెక్కిన బాస్ మూవీలో పూనమ్ బజ్వా సెకండ్ హీరోయిన్ గా నటించింది. నయనతార మెయిన్ హీరోయిన్ గా చేసింది. బాస్ యావరేజ్ రిజల్ట్ అందుకుంది. మరలా ఆమెకు స్టార్ చిత్రాల్లో ఛాన్స్ దక్కలేదు.

    బొమ్మరిల్లు భాస్కర్ అల్లు అర్జున్ హీరోగా పరుగు మూవీ చేశారు. ఈ మూవీలో హీరోయిన్ అక్క పాత్రలో తళుక్కున మెరిసింది. ఈ మూవీలో పూనమ్ బజ్వా హీరోయిన్ కాదు. అందుకే పరుగు హిట్ టాక్ తెచ్చుకున్నా పూనమ్ బజ్వా కెరీర్ కి ప్లస్ కాలేదు. పరుగు అనంతరం వరుసగా తమిళ చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో పూనమ్ బజ్వా నటించిన చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఎన్టీఆర్ కూతుళ్లతో ఒకరైన లోకేశ్వరిగా ఆమె నటించారు.

    తిక్క మూవీ దర్శకుడు సునీల్ రెడ్డితో పూనమ్ కొన్నాళ్ళు ఎఫైర్ నడిపింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. కారణం తెలియదు కానీ ఇప్పుడు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఫేడ్ అవుట్ అయిన పూనమ్ బజ్వా ఇంస్టాగ్రామ్ లో మాత్రం రచ్చ చేస్తుంది. సిల్వర్ స్క్రీన్ మీద హోమ్లీ రోల్స్ చేసిన అమ్మడు, ఇంస్టాగ్రామ్ లో మాత్రం హాట్ ఫోటో షూట్స్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా ఆమె బికినీని పోలిన డ్రెస్ లో సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చింది.